ఏపీలో ఈ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న ఎన్నికల హామీని నిలబెట్టుకునే దిశగా కూటమి సర్కార్ అడుగులేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వరుసగా జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో అమరావతిలోనూ త్వరలో జాబ్ మేళా నిర్వహించబోతోంది. ఇందుకు సంబంధించిన వివరాలను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సీఆర్డీయే అధికారులు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి & శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏపీ సీఆర్డీఏ సౌజన్యంతో అక్టోబర్ 31, 2025న ఉదయం 10 గంటల నుంచి తుళ్లూరులోని సీఆర్డీఏ స్కిల్ హబ్ కేంద్రంలో "జాబ్ మేళా" నిర్వహించనున్నారు. తొలుత ఈ జాబ్ మేళాను ఈ నెల 29న నిర్వహించాలని భావించినా..మొంథా తుఫాన్ కారణంగా ఈ నెల 31కి వాయిదా వేశారు. ఈ జాబ్ మేళాలో ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎఫ్‌ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సీఐఈఎల్ (ఈనాడు), దుర్గా ఏజెన్సీస్, మాత్రే హ్యూమన్ రిసోర్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్, భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రింగిల్ ఐటీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూ చెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి.
జాబ్ మేళాలో ఇంజినీర్ టెక్నికల్ సపోర్ట్, సొల్యూషన్ సపోర్ట్ ఇంజినీర్, ఇన్‌స్టాలేషన్ ఇంజినీర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, హెచ్ఆర్, హెచ్ఆర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫార్మా సేల్స్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ సర్వీస్, టెలికాలర్స్, కౌన్సిలర్స్, టర్నింగ్ ఆపరేటర్, జూనియర్ టెక్నిషియన్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆఫీసర్, కాల్ సెంటర్ సూపర్‌వైజర్, అస్సెట్ ఇంజినీర్, వెబ్ డెవలపర్, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, గ్రాఫిక్ డిజైనర్స్, స్టోర్ ఇన్‌ఛార్జ్, పికర్ & ప్యాకర్, ఏఎస్ఎం, ల్యాబ్ టెక్నిషియన్, CIF ల్యాబ్ టెక్నిషియన్, HVAC ఇంజినీర్, HVAC టెక్నిషియన్, లేడీ సెక్యూరిటీ ఆఫీసర్, ప్లంబింగ్ ఇంజినీర్, హాస్టల్ సూపర్‌వైజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్, స్టోర్ హెల్పర్, డ్రైవర్, హౌస్‌కీపింగ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి.
SSC, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, బీటెక్, ఏదైనా డిగ్రీ, పీజీ చదివి 18 నుంచి 40 ఏళ్లలోపు వయస్సు కలిగిన ఫ్రెషర్స్, వృత్తి అనుభవం ఉన్న అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు రూ.12,000 నుంచి రూ. 25,000 వరకు వేతనం లభిస్తుంది. కొన్ని ఉద్యోగాలకు అదనంగా వసతి, భోజన సదుపాయం, ఇన్సెంటివ్‌లు, అలవెన్సులు సైతం లభిస్తాయి. జాబ్ మేళాకు సంబంధించిన పూర్తి వివరాలకు గ్రామంలోని సీఆర్డీఏ ఫెసిలిటేటర్‌ను సంప్రదించవచ్చు లేదా శ్రీకర్ 9963425999 నెంబర్ లో కాల్ చేయవచ్చు. జాబ్ మేళాలో పాల్గొనేవారు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు నైపుణ్యం పోర్టల్ https://naipunyam.ap.gov.in/లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos