కొవిడ్​ కేసులు ఏపీని కలవరపెడుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాకు చెందిన ఓ మహిళకు కొవిడ్​నిర్ధారణ అయింది. ఆమెని రిమ్స్​లోని (Rims) ఐసోలేటెడ్​వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. రిమ్స్​లో కొవిడ్​ బాధితుల కోసం మొత్తం 20 బెడ్లను సిద్ధం చేసినట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. కొవిడ్​ సోకిన మహిళ స్వస్థలం నంద్యాల జిల్లా చాగలమర్రి. ఆమె వయసు 70 ఏళ్లు. నాలుగు రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఆమెను వైద్యులు పరీక్ష నిర్వహించి కొవిడ్​గా గుర్తించారు. నిన్న విశాఖలో ఓ మహిళకు కరోనా పాజిటివ్​గా నిర్ధారించిన విషయం తెలిసిందే. కొవిడ్​ కేసులు వ్యాప్తి చెందుతుండడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు కీలక సూచనలు చేసింది. ప్రజలు గుంపులుగా గుమికూడదని, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, అన్ని పబ్లిక్ స్థలాల్లో కొవిడ్  నియమాలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని, 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంట్లోనే ఉండాలని పేర్కొంది. దగ్గినపుడు, తుమ్మినపుడు చేతులు అడ్డు పెట్టుకోవాలని.. చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించింది.

ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్ లో ఉండాలని.. వైద్యుల సలహాతో మందులు వాడాలని తెలియజేసింది. కాగా, 2020 - 21లో కొవిడ్ మహమ్మారి దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ మళ్లీ ఇప్పుడు తాజాగా నిన్న విశాఖపట్నంలో, ఇవాళ నంద్యాల జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos