ఏపీలో విశాఖ కేంద్రంగా 15 బిలియన్ డాలర్ల వ్యయంతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే గూగుల్ ముందుకొచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంది. అదానీ గ్రూప్ తో కలిసి గూగుల్ ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుండటంతో నగరంలో ఇలాంటి డేటా సెంటర్ల ఏర్పాటుకు మరిన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా మరో సంస్థ ఇలాంటి డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
వైజాగ్‌లో 1 గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ను నిర్మించడానికి రిలయన్స్-జెవి డిజిటల్ కనెక్షన్ రూ.98,000 కోట్లు పెట్టుబడి పెడుతుందన్న విషయాన్ని పంచుకోవడానికి సంతోషంగా ఉందని ఐటీ మంత్రి నారా లోకేష్ ఇవాళ ట్వీట్ చేశారు. వైజాగ్ భారతదేశ డేటా రాజధానిగా అవతరించిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్ పత్రికలో వచ్చిన వార్తను ఆయన తన ట్వీట్ కు ట్యాగ్ చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రూక్ ఫీల్డ్ సంస్థల జాయింట్ వెంచర్ అయిన జేవీ డిజిటల్ కనెక్షన్ సంస్థ ఈ డేటా సెంటర్ ను వైజాగ్ లో ఏర్పాటు చేయబోతోంది. విశాఖలో 400 ఎకరాల్లో తమ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు తాజాగా జేవీ డిజిటల్ సంస్ద వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో ఇందుకోసం 11 బిలియన్ యూఎస్ డాలర్లు ఖర్చుపెట్టబోతున్నట్లు తెలిపింది. తాజాగా గూగుల్ ప్రకటించిన 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి తర్వాత దేశంలోకి రాబోతున్న రెండో అతిపెద్ద పెట్టుబడి ఇదే కావడం విశేషం.
ఈ డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఏపీ ఆర్దికాభివృద్ధి సంస్థతో జేవీ డిజిటల్ తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. డిజిటల్ కనెక్షన్ డేటా సెంటర్లు సజావుగా ఏఐ వర్క్‌లోడ్‌లకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించినవని, ఇవి హైపర్‌స్కేలర్‌లు , ఎంటర్‌ప్రైజెస్‌లను భవిష్యత్తు-సిద్ధంగా ఉన్న వ్యవస్థలు, బలమైన సబ్‌స్టేషన్‌లు, అనవసరమైన పవర్ ఫీడ్‌లు , రాక్ డెన్సిటీలతో తదుపరి దశాబ్దపు ఆవిష్కరణలకు శక్తినివ్వడానికి శక్తినిస్తాయని జేవీ డిజిటల్ వెల్లడించింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos