పెట్టుబడులకు విశాఖపట్నం గమ్యస్థానంగా మారుతోంది. సాగర తీరంలోని విశాఖకు పరిశ్రమలు భారీగా వస్తున్నాయి. దాదాపు రూ. 88, 000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం, గూగుల్ మధ్య నిన్న మంగళవారం అక్టోబర్ 14న అవగాహన ఒప్పందం కుదిర్చుకున్న విషయం తెలిసిందే. దీంతో దేశానికి తలమానికంగా నిలిచే.. ఏఐ హబ్‌గా విశాఖ అవతరించనుంది. అయితే కేవలం ఐటీకి సంబంధించిన పెట్టుబడులే కాకుండా స్టీల్, ఎనర్జీ రంగాల్లో కూడా భారీ పెట్టుబడులు వచ్చాయి. 

విశాఖ ఐటీ, డేటా సెంటర్ల హబ్‌గా మారనుంది. సాఫ్ట్‌వేర్‌తో పాటు రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టాయి. టీసీఎస్ రూ. 1370 కోట్లు, కాగ్నిజెంట్ రూ. 1583 కోట్లు, యాక్సెంచర్ రూ. 1200 కోట్లు, ఏఎన్ఎస్ఆర్ రూ. 1000 కోట్లు, సత్వ డెవలపర్స్ రూ. 1500 కోట్లు, ఫీనమ్ 207 కోట్లు, పీపుల్ ఉర్సా రూ. 5278 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కంపెనీలన్నీ కొలువైతే.. భవిష్యత్తులో విశాఖలో మరో హైటెక్ సిటీ రూపుదిద్దుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖపట్నం కేవలం ఐటీ హబ్‌గానే కాకుండా.. స్టీల్ హబ్‌గా కూడా మారబోతోంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రభుత్వ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కాకుండా అర్సెలార్‌మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ (ArcelorMittal Nippon Steel India) కంపెనీ కూడా రాజయ్యపేట ప్రాంతంలో స్టీల్ ప్లాంట్, క్యాప్టివ్ పోర్టులను నిర్మిస్తోంది. దీనికోసం రూ.1.47 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఇక గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై దృష్టి పెట్టిన ఎన్టీపీసీ.. విశాఖ ప్రాంతంలోని పూడిమడకలో రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. మొత్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖ పరిధిలో రూ.6.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఈ భారీ పెట్టుబడులే కాకుండా.. రాంబిల్లిలో న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌ బేస్, భోగాపురం విమానాశ్రయం, మూలపేట పోర్టు, జీఎంఆర్‌ యూనివర్సిటీ, ఫార్మా పార్కు ప్రాజెక్టుల పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. అంతేకాకుండా పర్యటకులను ఆహ్వానించేందుకు స్టార్‌ హోటల్స్ కూడా సిద్ధమవుతున్నాయి. అందుకు తగ్గట్టుగా మాస్టర్‌ప్లాన్‌ రోడ్లు, ఫ్లైఓవర్లు, కోస్టల్‌ కారిడార్, రైల్వే జోన్, మెట్రో.. వంటి రవాణా సౌకర్యాలను కూడా మెరుగుపరిచేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos