ఏపీ పారిశ్రామిక ప్రగతిలో మరో కీలక ముందడుగు పడింది. దేశంలోనే మొట్టమొదటి అమోర్ఫస్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయనున్నారు. అమెరికా-జపాన్ దేశాలకు చెందిన ప్రొటీరియల్ అనే సంయుక్త సంస్థ ఈ ప్రాజెక్టును తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో స్థాపించనుంది. రూ.1350 కోట్ల భారీ పెట్టుబడితో ‘మెట్‌గ్లాస్ ఇండియా’ పేరుతో ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్టీల్ ప్లాంట్‌ను ప్రొటీరియల్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడ అత్యాధునిక జపాన్ టెక్నాలజీని ఉపయోగించి అల్లాయ్ రిబ్బన్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా సుమారు 200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలిదశలో ఏటా 30 వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేసి, కార్యకలాపాలు ప్రారంభిస్తామని ప్రొటీరియల్ సంస్థ సీఈవో శాన్‌స్టాక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాల వల్లే తాము ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ స్టీల్ ప్లాంట్ రాకతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని భావిస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos