వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ ఇచ్చింది. మొంథా బీభత్సాన్ని మరువక ముందే మరో తుఫాను అలర్ట్ జారీ అయింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ.. మరింత బలపడే అవకాశం ఉన్నదని, వాయుగుండంగా బలపడనుందని అంచనా వేసింది. ఈ అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో ఈ నెల 15 నుంచి తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఈ నెల 19 లేదా 20వ తేదీన దక్షిణ అండమాన్‌ సముద్రం లేదా ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత పశ్చిమంగా పయనించే క్రమంలో ఇది బలపడి తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా రానుందని అంచనా వేశారు. దక్షిణ కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఉంటుందని విశ్లేషించారు. దీని కంటే ముందుగా మరో నాలుగైదు రోజుల్లో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఒకటి ఏర్పడి దక్షిణ తమిళనాడు దిశగా వస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న రెండు, మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసి, ఆ తర్వాత వాతావరణం పొడిగా ఉంటుందని వారు తెలిపారు.

కాగా, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా మారి పొడి వాతావరణం నెలకొంది. దక్షిణ భారతం పైకి చలిగాలులు వీస్తుండటంతో ఆదివారం కోస్తా, రాయలసీమల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. పాడేరు ఏజెన్సీ, తెలంగాణకు ఆనుకుని ఉన్న మధ్యకోస్తా, రాయలసీమలోని కొన్నిచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదయినట్లు వెల్లడించారు. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగి పుట్టులో 14.4, డుంబ్రిగుడ లో 14.7, పెదబయలులో 15.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17 డిగ్రీల లోపు నమోదు అవుతున్నాయి. ఇక.. రాష్ట్రంలోని పలు ప్రాంతా ల్లో ఈ నెల 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. దీని ప్రభావం రాష్ట్రం పై పెద్దగా ఉండబోదని నిపుణులు అంచనా వేస్తున్నా.. వర్షాలు మాత్రం కురుస్తాయని చెబుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos