ఏపీలో మావోయిస్టుల ప్రభావం ఏ స్ధాయిలో ఉందో గుర్తుచేసేలా వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు నేతల్ని హతమార్చిన పోలీసులు.. ఇవాళ మరో ఎన్ కౌంటర్ లో ఏడుగురిని చంపేసారు. వీటి వివరాల్ని ఇంటెలిజెన్స్ ఛీఫ్ మహేశ్ చంద్ర లడ్డా కొద్దిసేపటి క్రితం విజయవాడలో వెల్లడించారు. ఇవాళ కూడా ఏజెన్సీలో నక్సల్, పోలీసులు కు మధ్య కాల్పులు జరిగాయని, ఏడుగురు చనిపోయినట్లు సమాచారం ఉందని, ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

ఛత్తీస్‌గఢ్ నుంచి ఏపికి రావాలని మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారని, నిఘా వర్గాలు వారి కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాయని లడ్డా తెలిపారు. ఈ నెల 17న కీలకమైన ఆపరేషన్ చేపట్టామని, నిన్న మారేడుమిల్లిలో హిడ్మా, మరో ఐదుగురు ఎన్ కౌంటర్ లో చనిపోయారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పట్టుబడినవారి నుంచి సేకరించిన సమాచారంతో ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారనే దృష్టి పెట్టి ఆపరేషన్ చేపట్టమన్నారు. ఎన్టీఆర్‌, కృష్ణా, కాకినాడ,‌కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి యాభై మంది మావోయిస్టులను పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఎక్కడా ఎవరికీ ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంతమంది కీలక వ్యక్తులను పట్టుకోవడం ఇదే ప్రధమమని లడ్డా తెలిపారు. కేంద్ర, రాష్ట్ర, ఏరియా, కమిటీ సభ్యులు, ఫ్లాటూన్ టీం లను పట్టుకున్నట్లు వెల్లడించారు. భారీస్ధాయిలో వెపన్స్  స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. తమ ఫీల్డ్ సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ పూర్తి చేశారని చెబుతూ... ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలిపారు. తమ ఇంటిలిజెన్స్ విభాగం ఈ విషయంలో బాగా పని చేసిందన్నారు.

తమకు ముందే సమాచారం వచ్చినా.. వారిపై నిఘా పెట్టామని,  వారి ఆలోచనలు, కార్యకలాపాలను గమనించి,అన్నీ సెట్ చేసుకున్నాక ఒకేసారి వారందరినీ పట్టుకున్నామని లడ్డా తెలిపారు. తెలంగాణలో కొంతమంది ఇటీవల సరెండర్ అయ్యారని, కొన్ని రోజులు షెల్టర్ తీసుకునేందుకు ఏపీలో పలు ప్రాంతాలను ఎంచుకున్నారని... మళ్లీ సమయం చూసి వాళ్ల ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారన్నారు. వారి మూవ్ మెంట్స్, ప్లాన్ల పై ఇతర సమాచారం లేదని ఆయన తెలిపారు. హిడ్మాను పట్టుకుని చంపామనే ప్రచారంలో నిజం లేదన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos