ఆంధ్రప్రదేశ్ రాజకీయవర్గాల్లో పెను సంచలనంగా మారిన లిక్కర్ స్కాంలో ఈడీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  సీఐడీ సిట్ దర్యాప్తు చేస్తున్న ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఈడీ  లేఖ రాసింది. నిందితులను విచారించడానికి విజయవాడ సీపీ అనుమతి కోరుతూ లేఖ రాసింది. ఎఫ్ఐఆర్ తో పాటు సీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్ల వివరాలతో అరెస్టు చేసిన వారి డీటైల్స్.. దర్యాప్తులో తేలిన నగదు లావాదేవీల వివరాలతో సహా మొత్తం వివరాలు అందించాలని ఈడీ కోరింది. పీఎంఎల్ఏ  సెక్షన్ కింద కేసులు నమోదు చేయనున్నారు.

ఏపీలో లిక్కర్ స్కాంలో  నగదు లావాదేవీలు చేయడం ద్వారా మొత్తం స్కాంను నడిపించారని సీఐడీ సిట్ చెబుతోంది.   ఈ వ్యవహారంలో సీఐడీ సిట్ చాలా వరకూ వివరాలు సేకరించింది. వరుసగా అరెస్టులు చేస్తోంది.  ఈ కేసులో కీలకమైన వ్యక్తులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ తమను అరెస్టు చేయకుండా చూడాలని సుప్రీంకోర్టులో పిటిషన్  వేశారు. ఆ పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో వారి కోసం సిట్ వెదుకుతోంది. వారు ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి ఇళ్లల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.       

ఈ కేసులో ఈడీ  దర్యాప్తు కోసం చాలా కాలంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గతంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ కేసును ఈడీకి రిఫర్ చేస్తున్నట్లుగా చెప్పారు. అవినీతి వ్యవహారంలో రాష్ట్ర సిట్ చర్యలు తీసుకుంటోంది. వేల కోట్ల మనీలాండరింగ్ ఇష్యూలో.. ఈడీ చర్యలు తీసుకుంటోంది. ఆర్థిక లావాదేవీలు, అక్రమ నగదు లావాదేవీలు, సూట్ కేసు కంపెనీల  గుట్టు ఇప్పటికే బయటపడటంతో నిందితులు అంతా ఇరుక్కుపోయినట్లుగా భావిస్తున్నారు.

మరో వైపు ఈ కేసులో  సీబీఐ విచారణ చేయించాలని టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ లేఖ రాశారు.  సీబీఐకి రాసిన అధికారిక లేఖలో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్  రూ.3600 కోట్లకు పైగా విలువైన భారీ మద్యం కుంభకోణంపై నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని కోరారు. రాష్ట్ర వనరులు మరియు ప్రజారోగ్యానికి సంబంధించిన ఇంత భారీ కుంభకోణం ఎలా అదుపు లేకుండా పోయిందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజం తెలుసుకునే హక్కు ఉందని.. నిందితుల్ని కఠినంగా శిక్షించాల్సి ఉందన్నారు.  ఈ కుంభకోణం  తీవ్రత, పరిమాణం , అంతర్రాష్ట్ర ఆర్థిక చిక్కులను దృష్టిలో ఉంచుకుని సీబీఐ వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని  కోరారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos