ఆంధ్రప్రదేశ్‌ లో సీఎం చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఎన్టీఆర్‌ స్మార్ట్‌ టౌన్‌షిప్‌ రియల్ ఎస్టేట్ వెంచర్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ఫీజులపై భారీగా రాయితీ ప్రకటించింది. ప్లాట్‌ ధరల పెరుగుదలతో పాటు రిజిస్ట్రేషన్‌ ఫీజులు ఎక్కువగా ఉండటం వల్ల కొనుగోలుదారులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

ఈ కొత్త విధానం ప్రకారం ఒకే ప్లాట్‌ను రెండు విడతలుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం అందిస్తోంది. ప్లాట్ మొత్తం విలువను రెండు భాగాలుగా విభజించి రిజిస్ట్రేషన్ ఫీజులు వేర్వేరుగా లెక్కించనున్నారు. ప్లాట్ విలువలో 60% బేస్ ప్రైస్‌గా, మిగిలిన 40% అభివృద్ధి ఛార్జీలుగా పరిగణిస్తారు. బేస్ ప్రైస్‌పై 7.5% రిజిస్ట్రేషన్ ఫీజు, అభివృద్ధి ఛార్జీలపై కేవలం 0.5% రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే విధిస్తారు. ఇది పాత విధానంతో పోలిస్తే ప్రజలకు భారీ ఊరటను అందిస్తుంది. ఇంతకు ముందు ప్లాట్ మొత్తం విలువపై 7.5% రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేశారు. దీంతో మధ్య తరగతి వర్గానికి ఇది కొంత మేర అధిక భారంగా మారిందని వాదనలు వచ్చాయి. అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఈ రెండు విడతల మోడల్‌ను తీసుకువచ్చిందని  అంటున్నారు.

CRDA, విశాఖ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో ఎన్టీఆర్‌ స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించుకున్న వారు ఈ రాయితీ ప్రయోజనాన్ని పొందగలుగుతారని అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త విధానానికి అనుగుణంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సైతం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలు తమ ప్లాట్లను రెండు రకాల దస్తావేజుల కింద రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం త్వరలో అమలులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఊరట దక్కనుందని భావిస్తున్నారు. అలానే మధ్యతరగతి వర్గానికి ఇంటి కలను నిజం చేయడంలో ఇది సహాయపడుతుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. మరోవైపు "ఇల్లు అందరికీ" పథకం లక్ష్యాన్ని మరింత ముందుకు నడిపించేలా ఉందని ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos