బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్‌ ప్రాంతంలో ఆదివారం అంటే రేపు 20న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో బంగాళాఖాతంలో ఈ నెల 22 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. ఆ తర్వాత ఈ అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 24 నాటికి వాయుగుండంగా బలపడవచ్చని తెలిపింది. ఈ వాయుగుండం ఆంధ్రప్రదేశ్​, పశ్చిమబెంగాల్‌ మధ్యలో తీరం దాటొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడ్డాక స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడన కారణంగా ఈ నెల 24వ తేదీ తర్వాత ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ రోజు, రేపు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 18వ తేదీ శుక్రవారం తిరుపతి, శ్రీసత్యసాయి, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, వైఎస్సార్, అన్నమయ్య, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.

ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు ముందు జాగ్రత్తల్లో భాగంగా  వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు, కాలేజీలకు సెలవులను ప్రకటించాయి. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని ప్రభుత్వ అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. ఏపీలో కొన్ని జిల్లాలకు ఆకస్మిక వరదలు ఏర్పడే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos