తిరుపతి: తిరుపతిని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతామనే యువగళం హామీ కార్యరూపం దాలుస్తోంది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఏడాదిలో రూ.35 కోట్లకు పైగా నిధులు కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో  తిరుపతి పట్టణం గొల్లవానిగుంటలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ క్రికెట్ పెవిలియన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అకాడమీలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. శాప్, తుడా సహకారంతో రూ.10.10 కోట్ల నిధులు వెచ్చించి ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను నిర్మించారు. ముందుగా క్రీడా ప్రాంగణానికి చేరుకున్న మంత్రి  లోకేష్ కు శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తో పాటు క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ అకాడమీలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. క్రీడా ప్రాంగణం మొత్తం కలియతిరిగారు. ఈ సందర్భంగా క్రికెట్, కబడ్డీ, కోకో, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ క్రీడాకారులతో గ్రూప్ ఫోటో దిగారు. కొద్దిసేపు వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం ఎన్టీఆర్ క్రికెట్ స్టేడియంతో పాటు ఎన్టీఆర్ క్రికెట్ పెవిలియన్ ను ప్రారంభించారు. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాల్ రాజ్, ఇతర క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు క్రికెడ్ ఆడారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులతో సంభాషించి వారిని ఉత్సాహపరిచారు. క్రీడా ప్రాంగణంలో ప్రణీత్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటుచేసిన వాటర్ ప్లాంట్ ను మంత్రి ప్రారంభించారు. ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను క్రికెట్ మైదానం, ఖోఖో, కబడ్డీ, ఖఖో, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ కోర్టులతో పాటు పలు క్రీడా సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. ఈ సముదాయం క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు ఈ ప్రాంత భవిష్యత్ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించనుంది.

అంతకుముందు తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో రూ.5.35 కోట్ల వ్యయంతో కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ, 200 మంది క్రీడాకారులకు వసతి సదుపాయం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన జూనియర్ బాక్సింగ్ రింక్ ను ప్రారంభించారు. గూడూరు నియోజకవర్గం కోటలో రూ.2.31 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం, సూళ్లూరుపేటలో రూ.2.70 కోట్ల వ్యయంతో క్రీడా వికాస కేంద్రం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రేణిగుంట ఏపీఎస్టీఆర్ఈఐఎస్ స్కూల్ లో రూ.80 లక్షల వ్యయంతో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాలను మంత్రి ఆవిష్కరించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos