ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం చంద్రబాబు వివరిస్తూ పథకాల అమలు గురించి చెప్పారు. కష్టంగా ఉన్నా అమలు చేస్తున్నామని తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అప్పులు చేసి అయినా అమలు చేస్తామన్నారు. అయినా వైసీపీ నేతల్లో అనుమానాలు తొలగిపోలేదు. పథకాల అమలు కష్టమే కానీ.. సీఎం చంద్రబాబుకు  వాటిని తప్పక అమలు చేయాలన్న సంకల్పం ఉంది. నా వల్ల కాదు అని చెప్పే పరిస్థితి ఉండదు. ఇలా ఏ రాజకీయ నాయకుడు చేయడు.  అయితే వైసీపీ నేతలు, ఆ పార్టీ మీడియా, సోషల్ మీడియా మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందని అందుకే అమలు చేయడం లేదని ప్రచారం చేసేస్తున్నారు. తద్వారా సంక్షేమ పథకాలపై ఇప్పుడిప్పుడే ఆశలు పెట్టుకోకుండా ప్రజల్ని మానసికంగా సిద్ధం చేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.

జగన్ రెడ్డి గత ఐదేళ్లలో చేసిన అప్పులు.. చేసిన విధ్వంసం కారణంగానే చంద్రబాబు ఇప్పుడు పథకాలు ఇవ్వలేకపోతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బలపడేలా వైసీపీ ప్రచారం ఉంటోంది. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఇదే కోరుకుంటున్నారు. అందుకే వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారానికి వారు పెద్దగా అడ్డం రావడం లేదు. ప్రజల్లో పథకాలపై అశలు తగ్గించే పనిని వైసీపీ చేస్తే.. తమకు అంత కంటే కావాల్సింది ఏముంటుందని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. 

సంక్షేమ పథకాలను అమలు చేసి తీరాల్సిందేనని లేకపోతే ఊరుకోమని వైసీపీ ప్రకటనలు చేయాలి కానీ.. చంద్రబాబు చేతులెత్తారని ఇక పథకాలు రావని ప్రచారం చేయడం అమాయకత్వానికి ఇది నిదర్శనమని రాజకీయ పండితులు అంటున్నారు. ఆ విషయం రాజకీయాల్లో కనీస ఆవగాహన ఉన్న వారికైనా తెలుస్తుంది. వైసీపీ నేతలకు .. వారి యజమానిలాగే  ఆలోచన, ప్రణాళిక లేవని, దాన్ని తెలుగుదేశం పార్టీ తమకు కావాల్సిన విధంగా ట్యూన్ చేసుకుంటోందని వారు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos