ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 23వ తేదీన విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ సంవత్సరం పబ్లిక్ పరీక్షలకు 6,19,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లిష్ మీడియంకి సంబంధించి 5,64,064 మంది విద్యార్థులు కాగా.. తెలుగు మీడియం వాళ్లు 51 వేల 69 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. విద్యార్థులు తమ ఫలితాలను మనమిత్ర వాట్సప్ నంబర్ (9552300009) లోనూ లేదా అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఏపీ ప్రభుత్వ వాట్సప్ నెంబర్ 9552300009 ద్వారా ఫలితాలు ఎలా తెలుసుకోవాలంటే.... దీనికోసం ముందుగా ఈ నెంబర్ మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. వాట్సాప్ ఓపెన్ చేసి ఈ నెంబర్‌కు హాయ్ అని మెసేజ్ పంపించాలి. వెంటనే మీకు సర్వీసెస్ ఎంపిక చేసుకోమని వస్తుంది. అందులో ఎడ్యుకేషన్ సర్వీసెస్ క్లిక్ చేస్తే పదో తరగతి ఫలితాల లింక్ కన్పిస్తుంది. ఇది క్లిక్ చేసి మీ పుట్టిన తేదీ, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే పీడీఎఫ్ రూపంలో మీ మార్కుల మెమో వస్తుందని అధికారులు వివరించారు.
మరోవైపు ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు రాకముందే ఫస్ట్ ఇయర్ ప్రవేశాల ప్రక్రియను సైతం ప్రభుత్వం ప్రారంభించింది. ఫలితాలు ప్రకటించడానికి ముందే తాత్కాలిక ప్రవేశాల ప్రక్రియను చేపట్టారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచే దరఖాస్తులు ఇస్తున్నారు. మే 31వ తేదీ వరకు అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టనున్నారు. పాస్ అవుతాననే ధీమా ఉన్న విద్యార్థులు కాలేజీలలో చేరడానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. మరోవైపు ఫలితాలు ప్రకటించగానే ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ (AP IIIT Notification 2025) సైతం విడుదల కానుందని అధికారులు చెబుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos