ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ రోజు  ప్రారంభం అవుతాయి . ఇప్పటికే గవర్నర్ గెజిట్ కూడా విడుదల చేశారు. గత జగన్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మరో నాలుగు నెలల పాటు కొనసాగిస్తూ కూటమి ప్రభుత్వం గత సమావేశాల్లో ఆమోదించింది. ఇక ఈసారి నాలుగు నెలలకు గాను అంటే డిసెంబర్ నుంచి మార్చి వరకు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనల మొత్తం 2.9 లక్షల కోట్ల రూపాయల వరకు ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి ఈ సమావేశాల్లో పలు చట్ట సవరణలు చేయడంతో పాటు కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది కూటమి సర్కార్. తొలి రోజు గవర్నర్ ప్రసంగం అనంతరం అమరావతికి సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇదిలావుండగా గత ప్రభుత్వం చేసిన విధ్వంసం ఎఫెక్టులు మరో రెండేళ్ల పాటు సులువుగా వెంటాడతాయి. వాటిని ఎదుర్కొంటూ నిధుల సమీకరణ చేసుకుంటూ పథకాలు అమలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం పాలన చేయాల్సి ఉంది. ప్రస్తుత ప్రభుత్వం పథకాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అభివృద్ధి, ఆదాయం పెంపునకు ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే పెట్టుబడులు, పనులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసింది. కేంద్రం నుంచి గరిష్టంగా నిధులు సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది.  పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలు అత్యంత ముఖ్యమైనవి. వాటికి నిధులు కేటాయిస్తే చాలా వరకూ రాజకీయంగా వచ్చే విమర్శలకు చెక్ పెట్టినట్లవుతుంది.

జగన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం ఎలా చేశారో అసెంబ్లీలో ప్రభుత్వం బయట పెట్టే అవకాశం ఉంది. అందుకే ఆ పార్టీ వారెవరూ ఆసెంబ్లీకి వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. బడ్జెట్ సమావేశాలకు వెళ్లేందుకు ఎమ్మెల్యేలకు జగన్ అవకాశం ఇవ్వలేదు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు లేదా జగన్ వచ్చినా రాకపోయినా అసెంబ్లీ దానికదే జరిగిపోతుంది. ఏకపక్షంగా కాకుండా…ప్రజల ముందు గత ప్రభుత్వ నిర్వాకాలన్నీ ముందు పెట్టి వారి నైజాన్ని వెల్లడించే ఆవకాశం ఉంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos