కర్ణాటక నుంచి తోతాపురి మామిడి పండ్ల దిగుమతిపై ఏపీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకు ఈరోజు అధికారికంగా లేఖ రాశారు. ఒకవేళ ఈ ఆంక్షలు కొనసాగితే, కర్ణాటక కూడా ప్రతీకార చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆ లేఖలో ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ వివాదం కారణంగా కర్ణాటకలోని మామిడి రైతులు, ముఖ్యంగా ఏపీ సరిహద్దు ప్రాంతాల్లోని వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీరంతా చిత్తూరు జిల్లాలోని విస్తృతమైన మామిడి ప్రాసెసింగ్ పరిశ్రమపై ఎక్కువగా ఆధారపడి జీవిస్తున్నారు.

ఈ వివాదానికి మూలం ఏపీలోని చిత్తూరు జిల్లా యంత్రాంగం ఈ నెల 7న జారీ చేసిన ఉత్తర్వులే. ఈ ఉత్తర్వుల ప్రకారం కర్ణాటకతో సహా పొరుగు రాష్ట్రాల నుంచి తోతాపురి మామిడి పండ్ల దిగుమతిని నిషేధించారు. ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయడానికి రెవెన్యూ, పోలీస్, అటవీ మరియు మార్కెటింగ్ శాఖలకు చెందిన బహుళ విభాగాల బృందాలను కీలక సరిహద్దు చెక్ పోస్టుల వద్ద మోహరించారు. దీనివల్ల మామిడి రవాణా నిలిచిపోయి, ఇరు రాష్ట్రాల మధ్య ఎంతోకాలంగా ఉన్న వాణిజ్య సంబంధాలకు అంతరాయం ఏర్పడింది.

సీఎం చంద్ర‌బాబుకు రాసిన లేఖలో ఈ నిషేధం సహకార సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు కర్ణాటక నుంచి కూడా ప్రతిస్పందన చర్యలకు దారితీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చ‌రించారు. మార్కెటింగ్ మార్గాలు మూసుకుపోవడం వల్ల వేలాది మంది మామిడి రైతుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని, పంట కోతల అనంతరం భారీ నష్టాలు వాటిల్లుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదే విషయంపై కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షాలినీ రజనీశ్‌ కూడా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ ఏకపక్ష చర్య వల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు, వాణిజ్య అంతరాయాలపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతినకుండా, వ్యవసాయ వాణిజ్యం యధావిధిగా కొనసాగేలా చూడాలని ఆమె కోరారు. ప్రస్తుతం ఈ ప్రతిష్టంభన కొనసాగుతుండగా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే స్పందన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ అడ్డంకులు ఎక్కువ కాలం కొనసాగితే ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను ప్రభావితం చేసే ప్రతి చర్యలను పరిశీలించాల్సి వస్తుందని కర్ణాటక హెచ్చరించింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos