ఏపీ శాసనసభలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశపెట్టారు. శుక్రవారం  రాష్ట్ర ఉభయ సభల్లో … రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల సభకు సమర్పించారు. సీఎం చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు.. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ పత్రాలను అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రసంగిస్తూ..  మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లు గా అంచనా వేసారు. అదే విధంగా రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు కాగా, ద్రవ్య లోటు రూ. 79,926 కోట్లుగా పేర్కొన్నారు. మూల ధన వ్యయం రూ.40,635 కోట్లు గా అంచనా వేసారు. ఇదే సమయంలో కీలక శాఖలకు కేటాయింపుల విషయంలో ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరించింది. ముఖ్య శాఖలకు భారీగా కేటాయింపులు చేసింది. డిప్యూటీ సీఎం పవన్ పర్యవేక్షిస్తున్న పంచాయి తీ రాజ్ -గ్రామీణాభివృద్ధి కి కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చింది. మంత్రి లోకేష్ నిర్వహిస్తున్న విద్యా శాఖకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. విద్యా శాఖ కు రూ 31,805 కోట్లు ప్రతిపాదించారు. ఉన్నత విద్య కోసం రూ 2,506 కోట్లను కేటాయిస్తున్నట్లు బడ్జెట్ లో స్పష్టం చేసారు. విద్యా శాఖ పరిధిలోనే తల్లికి వందనం అమలు కోసం రూ 9.407 కోట్ల ను బడ్జెట్ కేటాయింపులు చేసారు.

ఇంకా  శాఖల వారీగా చూస్తే... ప్రత్యేకంగా వ్యవసాయ అనుబంధ రంగాల కోసం రూ 13,487 కోట్లు కేటాయింపులు చేస్తూ కేశవ్ ప్రతిపాదించారు. బీసీ సంక్షేమానికి రూ.23,260 కోట్లు, వైద్యారోగ్య శాఖకు రూ.19,260 కోట్లు,పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.18,848 కోట్లు, జలవనరుల అభివృద్ధికి రూ.18,020 కోట్లు, మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధికి రూ.13,862 కోట్లు కేటాయించారు. అదే విధంగా విద్యుత్ శాఖకు రూ.13,600 కోట్లు, వ్యవసాయానికి రూ.11,636 కోట్లు, సాంఘిక సంక్షేమానికి రూ.10, 909 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రూ.10,619 కోట్లు ప్రతిపాదించారు. రవాణా శాఖకు రూ.8,785 కోట్లు, ఎన్టీఆర్‌ వైద్య భరోసాకు రూ.31,613 కోట్లు కేటాయించారు.

 అదేవిధంగా .. రాజధాని ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కిస్తున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడిందన్నారు. అన్ని రంగాలు మళ్లీ బలం పుంజుకుంటున్నాయని చెప్పారు. సేవల రంగంలో 11.7 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. పెన్షన్లను రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, దీపం పథకం ద్వారా అర్హులకు 3 ఉచిత సిలిండర్లు, 204 అన్న క్యాంటీన్లను ప్రారంభించినట్లు తెలిపారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు, తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు, రూ.25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos