అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది.. సాయంత్రం వెలగపూడిలోని సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. రూ.85 వేల కోట్ల పెట్టుబడులపై ఎస్‌ఐపీబీ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. రాజధాని అమరావతికి సంబంధించి గతంలో కాంట్రాక్టర్లకు కేటాయించిన పనుల టెండర్ల రద్దుకు ఈ క్యాబినెట్‌లో ఆమోదం తెలుపనున్నారు. ఆయా పనులకు సంబంధించి కొత్త టెండర్లు పిలిచే విషయంపై నేడు జరగబోయే కేబినెట్‌లో చర్చించి.. అనంతరం వాటికి ఆమోదం తెలపనున్నారు. సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైనా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీఎస్ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణంపై ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేసినట్లు సమాచారం..

జనవరి నుంచి అమరావతిలో నిర్మాణాలు ప్రారంభించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఢిల్లీ పర్యటనలో అమరావతికి సంబంధించి చర్చకు వచ్చిన అంశాలను సీఎం చంద్రబాబు సహచర మంత్రులకు వివరించనున్నారు. తాజాగా రూ.85 వేల కోట్ల పెట్టుబడులపై ఎస్‌ఐపీబీ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి తాజా బడ్జెట్ లో ప్రభుత్వం చేసిన కేటాయింపుల పైన వైసీపీ విమర్శలు చేస్తోంది. హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తోంది. దీంతో, వచ్చే జనవరి నుంచి జన్మభూమి - 2 ప్రారంభంచాలని డిసైడ్ అయింది. ఆ సమయంలోనే కొత్త రేషన్ కార్డులు.. కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నారు. అదే విధంగా సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పథకం అమలు గురించి ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

దీంతోపాటు అయిదు నెలల కాలంగా చర్చనీయాంశంగా మారిన వాలంటీర్ల అంశంపైన నేటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. సచివాలయాలను పంచాయితీలకు అనుసంధానం చేయటంతో పాటుగా అవసరం మేరకు వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ అంశం పైన చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక, విశాఖ రుషికొండ భవనాల వినియోగం పైన నేటి మంత్రివర్గంలో చర్చించనున్నారు. భవనాలను ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశం పైన చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అదేవిధంగా.. విద్యుత్ ఛార్జీల అంశం పైన చర్చ జరిగే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజులు ఉండటంతో.. సభలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos