ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఇవాళ  గురువారం జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించబోతున్నారు. సీఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన పలు అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే, కృష్ణా నది తీరంలో మెరినా వాటర్‌ఫ్రంట్ అభివృద్ధి కోసం భూ కేటాయింపుకు, రాజధానిలో గతంలో కేటాయించిన 112 ఫ్లాట్లలో మార్పులకు సైతం కేబినెట్ ఆమోదం తెలపనుంది.

అయితే, ఎస్‌ఐపీబీలో (SIPB) ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలకు కూడా ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మొత్తం 14 సంస్థలకు చెందిన రూ. 19,391 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా మంత్రిమండలి ఆమోదం ఇవ్వనుంది. అదేవిధంగా గత సమావేశాల్లో అమలు చేసిన పథకాలపై సమీక్ష, భవిష్యత్ పెట్టుబడుల ప్రణాళికలు, ప్రధాన సదుపాయాల అభివృద్ధి, విద్యా, రోడ్లు, రవాణా, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విభాగాల ప్రతిపాదనల ఆధారంగా కేబినెట్ సమావేశంలో ముఖ్య నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. కొత్త ప్రాజెక్టుల అనుమతులు, కీలక పదవుల నియామకాలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కేబినెట్ సమావేశం అనంతరం, తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలకు, వైసీపీ కౌంటర్లపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos