సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 6న సచివాలయంలో జరిగే భేటీలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనతో పాటుగా ఏపీలో పెట్టుబడుల పైన జరిగిన చర్చల గురించి వివరించే అవకాశం ఉంది. అదేవిధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు, అమరావతి నిర్మాణం, పోలవరం డయా ఫ్రమ్‌వాల్ నిర్మాణం పైనా చర్చించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రవేశ పెట్టే బడ్జెట్ పైన చర్చించి.. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ పైనా నిర్ణయం తీసుకోనున్నారు.
ఇక, ఏపీలో వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఇప్పటికే నిర్ణయం తీసుకునున్నారు. ఈ అంశంపై చర్చించి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఈ సారి సమావేశంలో ఉద్యోగుల అంశాల పైన కేబినెట్ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగులకు దాదాపు రూ 26 వేల కోట్ల మేర వివిధ చెల్లింపు బకాయిలు ఉన్నాయి. అందులో కొంత మేర చెల్లించేందుకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. పెండింగ్ డీఏల పైన ఈ సమావేశంలో చర్చించనుండటంతో పాటుగా ఒక విడత చెల్లింపునకు ఆమోదించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే విధంగా పీఆర్సీ ఏర్పాటు పైన చర్చ ఉంటుందని భావిస్తున్నారు.
అదే విధంగా కూటమి అధికారంలోకి వస్తే రైతు భరోసా నిధులు రూ 20 వేలకు పెంచుతామని ఇచ్చిన హామీ అమలుకు కూడా ముహూర్తం ఖరారు చేయనున్నారు. తాజాగా ఈ పథకం కింద ఎంత మంది రైతులకు నిధులు జమ చేయాల్సి ఉంటుందనే లెక్కలు తేల్చింది. కాగా, కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ తో కలిపి ఈ పథకం నిధులు జమ చేయాలని భావిస్తోంది. వచ్చే నెలలో అమలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. గతంలో రైతు భరోసా పేరుతో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకానికి కూటమి ప్రభుత్వం 'అన్నదాతా సుఖీభవ' గా పేరు మార్చింది. ఫిబ్రవరిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేలా ముహూర్తం ఫిక్స్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. అమ్మఒడి వచ్చే ఆర్దిక సంవత్సరంలో అమలు చేయనున్నారు. దీంతో, ఈ కేబినెట్ భేటీలో తీసుకునే నిర్ణయాల పైన ఆసక్తి నెలకొంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos