ఏపీ కేబినెట్ భేటీ వచ్చే నెల అంటే ఫిబ్రవరి 6న జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో వచ్చే బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. త్వరలో ప్రారంభించే సంక్షేమ పథకాలపై కూడా కేబినెట్‌ భేటీలో చర్చ జరగనుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రంలోగా ప్రభుత్వ శాఖల అధికారులు ప్రతిపాదనలను కేబినెట్‌ ఆమోదం కోసం పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ సమావేశంలో కీలక అంశాలను చర్చించి ఆమోదం తెలుపనున్నారు. పంచాయతీల్లో ఈ గవర్నెన్స్‌ అమలు తదితర అంశాలను చర్చించే అవకాశముంది.

ప్రస్తుతం దావోస్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను వివరిస్తూ.. పెట్టుబడులతో రండి అని ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. కాగా నాలుగు రోజుల దావోస్‌ పర్యటన గురువారంతో అంటే ఇవాల్టితో ముగియనుంది. చంద్రబాబు బృందం అక్కడి నుంచి బయలు దేరి అర్ధరాత్రి ఢిల్లీకి, శుక్రవారం ఏపీకి చేరుకోనుందని సమాచారం.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos