ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మంగళవారం మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు సమాచారం. అందులో భాగంగానే అమరావతిలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగంలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏఐ లివింగ్ ల్యాబ్స్' పేరిట యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న ఐటీ శాఖ ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ యూనివర్సిటీ ద్వారా అమరావతిని దేశంలోనే కీలక టెక్నాలజీ హబ్‌గా మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సాధారణ యూనివర్సిటీలకు భిన్నంగా, ఏఐ లివింగ్ ల్యాబ్స్ యూనివర్సిటీలో పాఠశాల విద్యార్థుల నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. యూజీ, పీజీ కోర్సులతో పాటు, ఏఐకి సంబంధించిన ఆధునిక సబ్జెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. విద్యార్థుల్లో చిన్న వయసు నుంచే భవిష్యత్ టెక్నాలజీపై అవగాహన పెంచడమే దీని ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఈ యూనివర్సిటీలో కేవలం సిద్ధాంతపరమైన బోధనకే పరిమితం కాకుండా, లైవ్ ల్యాబ్స్, రియల్ టైమ్ ప్రాజెక్టులు, ఇండస్ట్రీ ఆధారిత శిక్షణ అందించనున్నారు. విద్యార్థులు చదువుతున్నప్పుడే ప్రాక్టికల్ అనుభవం పొందేలా కోర్సులను రూపొందించనున్నారు. దీంతో ఉద్యోగావకాశాలకు తగిన నైపుణ్యాలు పెంపొందించే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే అమరావతిలో ప్రతిపాదితమైన క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీకి అనుబంధంగా ఏఐ లివింగ్ ల్యాబ్స్ యూనివర్సిటీ పనిచేయనుంది. క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ, డీప్ టెక్ రంగాల్లో పరిశోధనలకు ఇది కేంద్రంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు కలిసి అమరావతికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఇవాళ మంగళవారం హైదరాబాద్‌లో ప్రముఖ ఐటీ కంపెనీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. దాదాపు డజను మందికిపైగా ప్రముఖ టెక్ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపి, యూనివర్సిటీకి పరిశ్రమల సహకారం, పెట్టుబడులపై సమాలోచనలు చేయనున్నారు. ఈ యూనివర్సిటీ ఏర్పాటుతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడంతో పాటు, యువతకు అత్యాధునిక సాంకేతిక విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతిని భవిష్యత్ టెక్నాలజీ రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos