ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. ఉద‌యం 11 గంట‌ల‌కు సచివాలయంలో  సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న మంత్రిమండలి భేటీ కానుంది. క్యాబినెట్‌ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాజధానిలో 20,494 ఎకరాల భూసమీకరణకు క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వ‌నుంది. ప్రభుత్వం ఇప్పటికే 54,000 ఎకరాల భూమిని సేకరించింది. మరో 20 వేల ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై ఇవాళ్టి క్యాబినెట్‌ భేటీలో చర్చించనున్నారు.

రాజధాని అమరావతిలో 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెల‌ప‌నుంది. రాజధాని నిర్మాణానికి ఇసుక డీసిల్టేషన్‌కు అనుమతిపై క్యాబినెట్ సమావేంలో చర్చించనున్నారు. హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్‌పై చర్చించిన అనంతరం క్యాబినెట్‌ ఆమోదం తెల‌ప‌నుంది. అమరావతిలో అల్లూరి, అమరజీవి స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించినందున అందుకు క్యాబినెట్‌ అమోదం తెల‌ప‌నుంది. అమ‌రావ‌తిలో ప‌లు సంస్థ‌ల‌కు భూ కేటాయింపులకు మంత్రిమండలి అమోదం తెల‌ప‌నుంది. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి క్యాబినెట్ లో ప్రత్యేకంగా చర్చించనున్నారు. సుపరిపాలన… తొలి అడుగు ఫీడ్ బ్యాక్ పై క్యాబినెట్ తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. బంగారుపాళ్యంలో జగన్ పర్యటనపైనా మంత్రిమండలి సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో తల్లికి వందనం కార్యక్రమం అమలుచేసిన తీరు, మహిళలకు ఆగస్టు 15 నుంచి అమలు చేయబోతున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం గురించి కూడా నేటి మంత్రిమండలి సమావేశంలో చర్చించనున్నారు. రైతు భరోసా పథకంపై మంత్రివర్గం దృష్టి సారించనుంది. పరిశ్రమల అభివృద్ధికి భూముల కేటాయింపు అంశం కూడా ఈ సమావేశంలో కీలకం కానుంది. ఇవాళ్టి క్యాబినెట్‌ సమావేశఃలో పలు బిల్లులకు కూడా ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos