ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం అంటే ఈ రోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరగనుంది. ఈ భేటీలో వివిధ అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 11 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో .. ఈ కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక అంశాలు చర్చకు రానున్నాయి.
ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టలేదు. దాంతో పూర్తి స్థాయి బడ్జెట్‌పైనా ఈ కేబినెట్‌లో చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది.
కాగా, ఈ నెల 11 నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలకు సంబందించి గవర్నర్ అబ్దుల్ నజీర్ నిన్ననే నోటిఫికేషన్ జారీ చేశారు. 11వ తేదీ ఉదయం పది గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించనున్నారనే అంశంపై బీఏసీలో స్పష్టత రానుంది.
అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అంశంపై చర్చ జరగనుంది. దీంతో పాటు జీవో 77ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకోనున్నారు. 2017లో చేసిన స్మార్ట్ పల్స్ సర్వే నివేదికను నామినేటెడ్ పోస్టుల నియామకానికి ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించింది.
అలాగే కొత్త క్రీడా విధానం, డ్రోన్, సెమీకండక్టర్, డాటా సెంటర్ పాలసీలపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంపుదల ప్రతిపాదనపై చర్చించనున్నారు. ఒలంపిక్స్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహకం రూ.7 కోట్ల కు పెంపుపైనా కేబినెట్ చర్చించనుంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos