ఏపీ కేబినెట్ నేటి మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశ కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సీఆర్డీయే  ఆమోదించిన పనులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దీంతోపాటుగా సీఆర్డీయే 22,607 కోట్ల రూపాయలతో చేపట్టనున్న 22 పనులకు ఆమోదం తెలపనుంది. మున్సిపల్ శాఖలోని పలు పనులకు ఆమోదం తెలపనుంది. సీఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన 37,702 కోట్ల టెండర్ల పనులు చేపట్టేందుకు క్యాబినెట్ ఆమోదం తెలపనుందని సమాచారం. ఏపీ కేబినెట్ అమోదంతో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు సీఆర్డీఏ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు జారీ చేయనుంది. అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ చేపట్టిన రూ.15081 కోట్ల విలువైన 37 పనులకు, అదేవిధంగా అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయిoపులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మున్సిపల్ శాఖ లోని పలు ఎజెండాలకు, 4వ ఎస్ఐపీబీ మీటింగ్ అమోదం తెలిపిన వాటికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. 10 సంస్థల ద్వారా వచ్చే రూ. 1,21,659 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదించనుంది. ఇంకా పలు కీలక అంశాలపై మంత్రి మండలిలో చర్చించి ఆమోదం తెలపనున్నారని సమాచారం. 

ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో రూ.1,742 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే దాల్మియా సిమెంట్ సంస్థ కడప జిల్లాలో రూ.2,883 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు, లులూ గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ విశాఖపట్నం నగరంలో రూ. 1,500 కోట్ల పెట్టుబడులతో ఇంటర్నేషనల్ కన్వెషన్ సెంటర్ ఏర్పాటుకు, సత్యవీడు రిజర్వ్ ఇన్ ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ శ్రీసిటీలో రూ.25వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.58,469 కోట్ల పెట్టుబడులకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని తెలుస్తోంది.  నెల రోజుల్లో రాష్ట్రంలో ఐదు చోట్ల 5 రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు, అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు క్యాబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. మొత్తానికి ఇవాళ జరగబోయే క్యాబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos