ఏపీ రాజధాని అమరావతి పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాజధాని అమరావతి నిర్మాణం లో కీలక ఘట్టం ప్రారంభం కానుంది. మధ్యలో నిలిచిన పనులను తిరిగి పునరుద్దరించేందుకు ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలపడమే కాకుండా ఆ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మొత్తం 20 పనులకు ఆమోద ముద్ర వేసిన సీఆర్డీఏ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం తాజాగా ఈ పనుల కోసం 11467 కోట్ల రూపాయలకు సర్కార్ పరిపాలన ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇక నిర్మాణాల కోసం టెండర్లు పూర్తి చేసి జనవరిలో పనులు ప్రారంభించాలని ప్రభుత్వ భావిస్తోంది.

సగంలో ఆగిన నిర్మాణాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, సివిల్స్ అధికారుల క్వార్టర్లు ఉన్నాయి. ముందుగా వాటి నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇక, సీఆర్‌డీఏ ప్రాజెక్టు ఆఫీసు బిల్డింగు ఎలా ఉండాలనే దానిపై వెబ్​సైట్‌ ద్వారా నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు పోలింగ్ నిర్వహించారు. ఇప్పుడు డిసెంబర్ 14 తేదీ వరకూ ఓటింగ్ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఓటింగ్ కోసం ప్రజల నుంచి మంచి స్పందన కనిపించడంతో గడువు పెంచటం ద్వారా మరింత మంది అభిప్రాయాలు తెలిపేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరోవైపు  ఇప్పటికే కేంద్రం అమరావతి నుంచి కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు ఆమోదం తెలపడమే కాకుండా... అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణ నిధులకు అంగీకరించింది. దీంతో, వచ్చే నెల నుంచి పనులను వేగవంతం చేయాలని ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు నిర్మాణాలకు పాలనా పరమైన అనుమతి రావటంతో ఇక అమరావతి నిర్మాణం వేగంగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos