ఎ. రేవంత్ రెడ్డి ,  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఒకే సారి ఢిల్లీ వెళ్లనున్నారు.  ఇవాళ మంగళవారం మధ్యాహ్నం రేవంత్ ఢిల్లీ వెళతారు.  16, 17 తేదీల్లో అక్కడే ఉంటారు.  ఇవాళ సాయంత్రం ఢిల్లీలో జరిగే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సంస్మరణ సభలో సీఎం పాల్గొనే అవకాశం ఉంది.  ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.  తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదికను పంచుకునే అవకాశం ఉంది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రెండు రోజుల పర్యటన నిమిత్తం 15, 16 తేదీల్లో ఢిల్లీలో ఉంటారు. ఈ పర్యటనలో భాగంగా  కేంద్రమంత్రులతో ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చలు నిర్వహిస్తారు.  రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, కేంద్ర గ్రాంట్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన అంశాలను ఆయా మంత్రిత్వ శాఖలతో సీఎం చర్చించనున్నారు. ఇవాళ 15వ తేదీ మధ్యాహ్నం చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. అదే రోజు కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే సారస్వత్‌, ఢిల్లీ మెట్రో రైల్‌ ఎండీ డాక్టర్‌ వికాస్‌ కుమార్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అవుతారు. విశాఖ, విజయవాడ మెట్రోలపై చర్చిస్తారు.

మరోవైపు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి నేతృత్వంలో జరిగే సమావేశంలో రేవంత్ రెడ్డి,  చంద్రబాబు నాయుడు ఇద్దరూ తెలంగాణ ,  ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాలపై చర్చించే అవవకాశం ఉంది. తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా,  గోదావరి నదుల జలాల విభజనపై దీర్ఘకాలంగా వివాదం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర జలశక్తి మంత్రితో జరిగే సమావేశం కీలకమైనది. బనకచర్ల అంశంపై కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో చర్చిస్తే.. తాత్కాలికంగా అయినా ప్రస్తుత వివాదానికి ముగింపు లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బనకచర్ల అంశంపై ఏపీలోనూ ఇప్పుడిప్పుడే అది అంత లాభదాయకమైన ప్రాజెక్టు కాదన్న చర్చ జరుగుతోంది. ప్రజాభిప్రాయం మేరకు  చంద్రబాబు ప్రస్తుతం పూర్తిగా పోలవరంపైనే దృష్టి పెట్టి ఆ తర్వాత..   బనకచర్ల అంశాన్ని  చేపట్ట వచ్చని.. ఇప్పటికి అంత దూకుడు చూపించకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos