ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. రైతులు.. మహిళలకు ఉగాది కానుక గా రెండు కీలక అంశాలను వెల్లడించారు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి అనేక అంశాలను ప్రస్తావించారు. అధికారులకు దిశా నిర్దేశం చేసారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులు.. మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 13 అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. 2 లక్షల 50 వేల ఇళ్ళు గృహ ప్రవేశాలు ఉగాదికి ఉంటాయని చెప్పారు. అన్నదాత సుఖీభవ,ఇళ్లు ఈ రెండు ఉగాది కానుకలుగా పేర్కొన్నారు.

రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధులు మరో 2 రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయి. పీఎం కిసాన్​ 22వ విడత నిధులు మార్చి 13న విడుదల కానుండగా అదే రోజున ఏపీ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అస్సాంలోని గువాహటిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ, కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని, నిధులు విడుదల చేయనున్నారు. 3వ విడత కింద రాష్ట్రంలో 46.80 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.6000 చొప్పున మొత్తం రూ.2,808 కోట్లు అందనున్నాయి. ఇందులో పీఎం కిసాన్ కింద కేంద్రం రూ.2000, అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.4000 చొప్పున జమ చేస్తాయి.

పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రాష్ట్రం నుంచి రూ.14,000, కేంద్రం రూ.6 వేలు ఇవ్వనున్నారు. పీఎం కిసాన్​ - అన్నదాత సుఖీభవ 3వ విడత కింద రూ.20,000 చొప్పున ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా 2 విడతల్లో రైతుల ఖాతాల్లో ఒక్కో రైతుకు రూ.14,000 చొప్పున మొత్తం రూ.6,309.44 కోట్లు జమ చేసింది. మిగిలిన రూ.6000 ఈ నెల 13న జమ చేస్తారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టును 2027లో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని చెప్పారు. 2027 మార్చి నాటికి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తామని వెల్లడించారు. ఎక్కడా భూ వివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతో పనిచేయాలని నిర్దేశించారు. పీజీఆర్ఎస్ ద్వారా ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం కావాలని స్పష్టం చేసారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos