ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. రాష్ట్రంలో మే 6 నుంచి జూన్ 13 మధ్య పలు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డు (ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ), బాల్ పాయింట్ పెన్ను (బ్లాక్, బ్లూ) వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. 

* మే 6న నిర్వహించే ఏపీఈసెట్ పరీక్షను రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.  

* మే 7న నిర్వహించే  ఏపీ ఐసెట్ పరీక్షను రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. 

* మే 19 నుంచి 27 మధ్య ఏపీఈఏపీసెట్ (AP EAPCET) పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు మే 19, 20 తేదీల్లో, ఇంజినీరింగ్ విభాగానికి మే 21, 24, 26, 27 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. 

* జూన్ 5న లాసెట్/పీజీఎల్‌సెట్ (AP LAWCET/PGLCET) పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 10.30 గంటల వరకు ఒకే సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.

* జూన్ 5న ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
  
* జూన్ 6 నుంచి 8 వరకు పీజీఈసెట్ (PGECET) పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు జరుగనున్నాయి.

* జూన్ 9 నుంచి 13 వరకు పీజీసెట్ (AP PGCET) పరీక్షలు మూడు సెషన్లలో జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 10.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రెండో సెషన్‌లో, సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు మూడో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos