ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్పష్టత ఇచ్చారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు డీఎస్సీ ద్వారా టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని స్పష్టత ఇచ్చారు. అలాగే.. మిగిలిన విభాగాల్లో ఖాళీల భర్తీకి సైతం చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నట్టు వెల్లడించారు. గతంలో ఎన్నడూలేని విధంగా అత్యధికంగా టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని కుటమి ప్రభుత్వం హామీ ఇవ్వడమే కాకుండా.. ఏకంగా 16,317 టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం డీఎస్సీ ఫైల్‌పైనే చేశారు. ఇదే క్రమంలో.. మెగా డీఎస్సీలో వీలైనంత ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలనే సంకల్పంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో టెట్‌ నిర్వహించారు.

వాస్తవంగా ఏపీలో మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తిరిగి ఎప్పుడు విడుదల చేస్తారన్న అంశంపై అధికారికంగా స్పష్టత లేదు. ఎస్సీ వర్గీకరణపై నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాతే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కాగా ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ 2, 3 నెలలపాటు వాయిదా వేసినప్పటికీ అనుకున్న సమయానికి టీచర్ల భర్తీ చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ క్రమంలో ఏపీ డీఎస్సీ 2025 నిర్వహణకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అభ్యర్థుల సన్నద్ధత కోసం ముందుగా సిలబస్‌ను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇటీవల ఏపీ డీఎస్సీ సిలబస్‌ విడుదల చేశారు.

మరోవైపు ఇప్పటికే ఏపీ టెట్‌ పరీక్షను నిర్వహించి  రిజల్ట్స్ ను  ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 1,87,256 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉపాధ్యాయ నియామ‌క ప‌రీక్ష (డీఎస్సీ)లో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ కూడా ఉంటుంది. ఈ టెట్‌ స్కోర్‌కు లైఫ్‌ లాంగ్‌ వ్యాలిడిటీ ఉంటుంది. మొత్తానికి కూటమి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి త్వరలో టీచర్ పోస్టులను భర్తీ  చేయనుండంటంతో నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos