ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. అయితే, విద్యార్థుల వార్షిక పరీక్షలు, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి కీలక అంశాల కారణంగా ఈ ఎన్నికలు వేసవి తర్వాతే ఉండవచ్చని స్పష్టమవుతోంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ట్రిపుల్ టెస్ట్ నిర్వహించేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో స్వతంత్ర కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించి 45 రోజుల్లో నివేదిక సమర్పించాల్సి ఉండటంతో, మార్చి నెలాఖరు వరకు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది.

సాధారణంగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో పాఠశాల, కళాశాల విద్యార్థులకు కీలకమైన బోర్డు పరీక్షలు జరుగుతాయి. ఈ సమయంలో పోలింగ్ కేంద్రాలుగా పాఠశాలలను ఉపయోగించడం, ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. దీనికి తోడు రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాతే వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఈ సాంకేతిక కారణాల దృష్ట్యా పరీక్షలు ముగిశాకే మే లేదా జూన్ నెలల్లో స్థానిక సమరానికి నోటిఫికేషన్ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంపై కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం నియమించిన ప్రస్తుత ఎస్ఈసీ నీలం సహాని పదవీకాలం త్వరలో ముగియనుంది. కొత్త ఎస్ఈసీగా రాష్ట్ర మాజీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అనుభవజ్ఞుడైన అధికారిని ఈ కీలక పదవిలో నియమించడం ద్వారా ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఆయన నియామకం పూర్తయ్యాకే ఎన్నికల షెడ్యూల్ పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అక్రమాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఎక్కడా విమర్శలకు తావులేకుండా పారదర్శకంగా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందుకే బీసీ రిజర్వేషన్ల శాస్త్రీయ లెక్కింపు కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ ఇచ్చే గణాంకాల ఆధారంగానే బీసీలకు న్యాయబద్ధంగా సీట్లు కేటాయించనున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితాల సవరణకు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ, పూర్తిస్థాయి నోటిఫికేషన్ మాత్రం రాజకీయ , విద్యాపరమైన సమీకరణల తర్వాతే వెలువడనుంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos