ఏపీలో నాలుగు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఈ ఏడాదిలో ముగియనుంది. అయితే ఇందులో ముగ్గురి పదవీకాలం జూన్ లోనూ, మరో సభ్యుడి పదవీకాలం డిసెంబర్ లోనూ ముగియబోతోంది. దీంతో వీరి స్ధానాల్లో కొత్త వారి ఎంపిక కోసం ఎన్డీయే కసరత్తు చేస్తోంది. వీటి వివరాలను ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటారని పేరున్న కొందరు రాజకీయ నాయకులు, సర్వే నిపుణులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ, ఎస్ నిరంజన్ రెడ్డి పదవీకాలం ఈ ఏడాది జూన్ లో ముగియబోతోంది. వీరంతా వైసీపీ సభ్యులే. మరో సభ్యుడు సానా సతీష్ బాబు (టీడీపీ) పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ లో ముగియనుంది. దీంతో ఈ నాలుగు సీట్లకూ అభ్యర్ధులు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో మంత్రి నారా లోకేష్ కు సన్నిహితుడిగా పేరున్న సానా సతీష్ బాబుకు ఈసారి పొడిగింపు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనకు గతంలో పూర్తి సమయం ఎంపీగా ఛాన్స్ దక్కకపోవడంతో ఈసారి పొడిగింపు ఇస్తారని సమాచారం. అలాగే మిగిలిన మూడు సీట్లను టీడీపీ, జనసేన, బీజేపీ పంచుకోబోతున్నట్లు చెబుతున్నారు. ఇందులో టీడీపీ నుంచి భాష్యం రామకృష్ణ, జనసేన కోటాలో లింగమేనని రమేశ్ బాబు, బీజేపీ నుంచి తమిళనాడు రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు అన్నామలైకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. చివరి నిమిషంలో బీజేపీ ఏదైనా ఒత్తిడి చేస్తే తప్ప ఈ పేర్లు దాదాపు ఖరారైనట్లేనని  వారు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos