వాట్సాప్ గవర్నెన్స్ తో ఎన్నో ప్రభుత్వ సేవలు ప్రజలకు అందిస్తున్న ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ బెట్టింగ్ నేరాలపై ఫోకస్ చేసింది. ఆన్ లైన్ బెట్టింగ్ ను ఆపేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్స్, క్రికెట్ బెట్టింగ్స్ ద్వారా ఒక్కరి జీవితం కాదు కుటుంబాలు సైతం నాశనం అవుతున్నాయని వీటికి చెక్ పెట్టాలంటే బెట్టింగ్ యాప్ లపై ప్రత్యేక చట్టం అవసరమని చంద్రబాబు అన్నారు. సీఎం చంద్రబాబు కలెక్టర్లతో నిర్వహిస్తున్న సమావేశం ఇవాళ రెండో రోజు జరుగుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు సహా పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో నేరాలకు అడ్డుకట్ట వేయాలని, లేకపోతే ప్రభుత్వ విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతాయని సీఎం ఉన్నతాధికారులకు సూచించారు. ‘ఏపీలో ఇతర నేరాలు క్రమంగా తగ్గుతున్నా.. ఆర్థిక నేరాలు మాత్రం పెరిగాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక గంజాయి సాగు తగ్గింది. ఎక్కడైనా గంజాయి వినియోగం కనిపిస్తే కఠిన చర్యలు తీసుకోండి. టెక్నాలజీ వినియోగం పెంచడం ద్వారా సైబర్ నేరాలు, ఆన్ లైన్ బెట్టింగ్స్ లాంటి వాటికి చెక్ పెట్టాలని సీఎం ఆదేశించారు.
సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ప్రమోట్ చేస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కు అడ్డుకట్ట వేయాలంటే ఏపీలో ప్రత్యేక చట్టం అవసరం. గేమింగ్ బెట్టింగ్, క్రికెట్, ఐపీఎల్ బెట్టింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్లను సైతం అరికట్టేలా బెట్టింగ్ యాక్ట్ చేయవలసిన అవసరం ఉంది. నేరస్తులు రోజు రోజుకు తెలివితేరిపోతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. నేరాల నియంత్రణలో టెక్నాలజీ వినియోగం బాగా పెరగాలి. టెక్నాలజీ ఉపయోగించి సైబర్ నేరాలను నియంత్రించాలి. అవసరమైతే కొన్ని సందర్భాలలో ప్రజల సహాయం తీసుకోవాలని’ ఉన్నతాధికారులకు చంద్రబాబు సూచించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos