ప్రతి ఒక్కరికీ ఆరోగ్యమే పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్ట్‌గా కుప్పం నియోజకవర్గంలో అమలు చేయనుంది. ఇవాళ గురువారం కుప్పం ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ప్రాజెక్ట్‌ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. టాటా కంపెనీ సహకారంతో డిజిటల్ సర్వే సెంటర్‌ని ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ట్రీట్‌మెంట్ కోసం వచ్చే రోగుల డేటాను డిజిటల్ రూపంలో టాటా కంపెనీ పొందుపరచనుంది. రోగులకు వ్యాధులపరంగా డేటా నమోదు చేయడంతో పాటు భవిష్యత్తులో వారి ట్రీట్‌మెంట్ కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ అమలుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కుప్పంలో ఈ పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఏపీవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది. కాగా ముఖ్యమంత్రి మధ్యాహ్నం స్వగృహానికి చేరుకొని అధికారిక సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలను ముగించుకొని సాయంత్రం 4:10 గంటలకు తుమ్మిసి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కి చేరుకుని బెంగళూరుకి తిరుగు ప్రయాణం అవుతారు.
ఇదిలావుండగా తిమ్మరాజుపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు నిన్న సుదీర్ఘంగా పర్యటించారు. సుమారు రెండున్నర గంటల పాటు గ్రామంలోని ప్రతి ఇంటికీ స్వయంగా వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వ పాలనపై ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టిన ముఖ్యమంత్రి.. ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టబోయే పథకాల గురించి గ్రామస్థులకు ఓపికగా వివరించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు తమ సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలు చెబుతున్న ప్రతీ సమస్యను సావధానంగా విన్న ఆయన, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos