104 ఉద్యోగులపై  ఎస్మా ప్రయోగించింది ఏపీ ప్రభుత్వం. వైద్య శాఖలోని 104 విభాగం లో పనిచేస్తున్న ఉద్యోగులు మరో ఆరు నెలలపాటు ఎలాంటి బంద్ లూ, నిరసనలు చేపట్టరాదంటూ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి  కృష్ణ బాబు  ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తున్నట్టు  ప్రభుత్వం పేర్కొంది.

గత 16 సంవత్సరాలుగా  చాలీ చాలని జీతంతో నెట్టుకొస్తున్న తమకు జీతాలు పెంచడం తో సహా ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలంటూ 104 ఉద్యోగులు కలెక్టరేట్ల ముందు ధర్నాకు పిలుపునిచ్చారు. తమకు జీతాలు  థర్డ్ పార్టీ ద్వారా  ఇస్తారనీ గత మూడు నెలలుగా అసలు జీతాలే ఇవ్వడం లేదనేది వారి వాదన. ప్రజల ప్రాణాలను కాపాడుతూ  104 అంబులెన్సులు  నడుపుతూ ఎంతో సేవ చేస్తున్నామని గత ప్రభుత్వం హయాం లో ఆర్థికంగా ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నామంటూ 104 ఉద్యోగులు దీక్షలు చేస్తున్నారు. థర్డ్ పార్టీ విధానాన్ని  విధానాన్ని రద్దు చేయడంతో పాటు తమను పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేది వారి డిమాండ్.

అలాగే ప్రభుత్వమే 104 అంబులెన్స్ లను నిర్వహించాలని వారు అంటున్నారు. ఆ డిమాండ్లలో భాగంగా ఈ రోజు  రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ముందు  ధర్నాలకు వాళ్ళు పిలుపు ఇచ్చారు. దీనివల్ల ప్రజలకు తీవ్ర  ఇబ్బంది కలుగుతుందంటూ ఏపీ ప్రభుత్వం తక్షణమే విధుల్లో చేరాలని ఎస్మా ను ప్రయోగించింది. ఇప్పుడు 104 ఉద్యోగులు ఏ విధంగా స్పందిస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొని ఉంది. సరిగ్గా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన ఆరు నెలలు పూర్తవుతున్న రోజునే ఇలా 104 ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించాల్సి రావడం చర్చనీయాంశమైంది.

కాగా ఉద్యోగులను కలవరపెట్టే  ఎస్మా అంటే ఏమిటంటే... 'ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటినెన్స్ యాక్ట్ ' నే ESMA గా పిలుస్తారు. 1981 లో ఈ చట్టాన్ని తొలిసారి రూపొందించారు. ప్రజల అత్యవసర సేవలకు,  జీవన విధానానికి ఆటంకం కలిగించేలా ఏదైనా విభాగ ఉద్యోగులు ధర్నాలు,ఆందోళనలకు దిగితే వారికి వ్యతిరేకంగా ఈ చట్టాన్ని ప్రయోగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య అవసరాలకు అత్యంత ముఖ్యమైన 104 సేవలు ఆటంకం కలిగించేలా  ఆందోళనకు దిగుతున్నారంటూ  ప్రస్తుతం ఆ విభాగ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించింది. ఉద్యోగులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు చూడాలి మరి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos