ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీ మేరకు ప్రతీ నెలా ఒకటో తేదీనే రూ 4 వేలు పెన్షన్ పంపిణీ చేస్తోంది. గతంలో ఉన్న వాలంటీర్ల స్థానంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ కొనసాగిస్తోంది. ప్రతీ నెలా సీఎం చంద్రబాబు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కొత్త పెన్షన్ల మంజూరు పైనా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాగా.. ఈ నెల పెన్షన్ల పంపిణీ వేళ ప్రభుత్వం కీలక మార్పు చేసింది. సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది.

కొత్త సంవత్సరం ప్రారంభం వేళ పెన్షన్ లబ్దిదారులకు ఒక రోజు ముందుగానే నగదు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 1, 2026 బదులుగా డిసెంబర్ 31నే పింఛన్లు అందనున్నాయి. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి డిసెంబర్ 30 నాటికి నగదు అందజేయాలని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ముందుగానే సమాచారం ఇచ్చింది. డిసెంబర్ 31నే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ, ఏవైనా మిగిలిపోతే, ఆయా పింఛన్లను జనవరి 2న పంపిణీ చేయాలని సూచించింది. ఈ మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాజాగా స్పష్టత ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నదని వివరించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలి నెల నుంచే వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులకు సామాజిక భద్రతా పెన్షన్ల కింద నెలకు రూ.4000 అందిస్తున్నారు. వికలాంగులు, కుష్టు వ్యాధిగ్రస్తులకు రూ.6000, పూర్తి వికలాంగులకు రూ.10,000, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు రూ.10000 ఆర్థిక సాయం అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 63.12 లక్షల పింఛన్‌దారులకు ప్రతీ నెలా ఒకటో తేదీనే రూ.2743.99 కోట్లు సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇంటివద్దనే పంపిణీ చేస్తున్నారు. ఒకటో తేదీ సెలవు వస్తే ముందు రోజునే పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. కాగా, ప్రభుత్వం తాజా ఆదేశాల మేరకు ఈ నెల 31వ తేదీ పెన్షన్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్దం అయిది. ఆ రోజున ఎవరికైనా అందకపోతే జవనరి 2న లబ్దిదారులకు అందించనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయని అధికారులు వివరించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos