ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిని ప్రమోట్ చేసేలా కొత్తగా బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని డిసైడ్ అయింది. ఈ మేరకు నామినేషన్ ప్రాతిపదికన నియమించేలా కసరత్తు కొనసాగుతోంది. నియామక మార్గదర్శకాలను ఖరారు చేసింది. అంతర్జాతీయ స్థాయి నగరంగా అమరావతిని ప్రమోట్ చేసేలా బ్రాండ్ అంబాసిడర్లు పనిచేయాలని ప్రభుత్వం పేర్కొంది. వివిధ స్థాయిల్లో అమరావతి నగరానికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకునేలా కార్యాచరణ రూపొందిస్తోంది. సుస్థిరత, అభివృద్ధి, ఆవిష్కరణ, సామాజిక స్థితి ప్రాతిపదికన బ్రాండ్ అంబాసిడర్లను ఎంపిక చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.

వివిధ రంగాల్లో నిపుణులు, రాజధాని ప్రాంత ప్రజలతో మమేకమైన వ్యక్తులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి కార్యాలయం నామినేట్ చేసిన వారిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది.  వచ్చిన నామినేషన్ల నుంచి వారి నైపుణ్యం, అర్హత, స్థాయిల ఆధారంగా ప్రభుత్వ అనుమతి తీసుకుని బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకోనున్నారు.

బ్రాండ్ అంబాసిడర్లుగా ముందుగా ఒక ఏడాది కాలానికి వారి సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. వారి పనితీరు ఆధారంగా ఆ తర్వాత పొడిగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. విజన్ అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడంతో పాటు పెట్టుబడులు తీసుకువచ్చేలా వీరు పనిచేయాలని ప్రభుత్వం పేర్కొంది. దీని కోసం బ్రాండ్ అంబాసిడర్లు ఎక్కడికక్కడ సదస్సులు, సమావేశాలు నిర్వహించడంతోపాటు అంతర్జాతీయ వేదికలపై కాన్ఫరెన్సులు, వర్క్ షాపుల్లో పాల్గొనాలని వివరించింది. తద్వారా భాగస్వాముల ను, పెట్టుబడి దారులను కూడా ఆకర్షించాలని సర్కార్ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఏపీ ఆర్థిక వృద్ధిలో అమరావతి ప్రాజెక్టు, స్మార్ట్ సిటీగా రాజధాని కోసం దేశీయ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించేలా బ్రాండ్ అంబాసిడర్లు చూడాలని ప్రభుత్వం పేర్కొంది.

కాగా అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా మెగాస్టార్ చిరంజీవితో పాటుగా ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ పేరు పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. చిరంజీవి అంగీకరిస్తే ఆయనతో పాటుగా మరో ఇద్దరు ప్రముఖల పేర్ల పైన కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దరఖాస్తుల పరిశీలన.. చర్చల తరువాత వచ్చే నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా అమరావతి బ్రాండ్ అంబాసిడర్ల పైన ప్రకటన చేయనున్నారని సమాచారం. చివరికి ఎవరిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తారో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos