రెస్టారెంట్ అండ్ బార్లపై విధించే రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఆర్ఈటీ) విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అధికారిక జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోకుండా, అంచనా వేసిన జనాభా ఆధారంగా ఆర్ఈటీ విధించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఏపీ ఎక్సైజ్ రూల్స్ -2025లోని రూల్ 3(టి) ప్రకారం జనాభా అంటే అధికారికంగా ప్రచురించిన జనాభా లెక్కలేనని న్యాయస్థానం గుర్తు చేసింది. 2011 తర్వాత అధికారిక జనాభా లెక్కలు జరగలేదని, ఆ లెక్కల ప్రకారం మైదుకూరు మున్సిపాలిటీ జనాభా 45,790 మాత్రమేనని పేర్కొంది.

50 వేల లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో ఆర్ఈటీ కింద రూ.35 లక్షలు మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. 2011 నుంచి జనాభా 1.9 శాతం పెరిగి ప్రస్తుతం 56,310కు చేరిందని మైదుకూరు మున్సిపల్ కమిషనర్ చేసిన అంచనాలకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వ్యాఖ్యానించింది. కమిషనర్ అంచనా జనాభాను ఆధారంగా తీసుకుని మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఓ బార్‌కు ఆర్ఈటీని రూ.55 లక్షలుగా నిర్ణయిస్తూ కడప జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.

పిటిషనర్ అభ్యర్థనను తీర్పు అందిన ఆరు వారాల్లోపు తిరిగి పరిశీలించాలని ఎక్సైజ్ అధికారులను హైకోర్టు ఆదేశించింది. నిర్ణీత గడువులోపు పునఃపరిశీలన చేయకపోతే మున్సిపాలిటీ జనాభా 50 వేల లోపే ఉన్నట్లు పరిగణించి రూ.35 లక్షల ఆర్ఈటీ మాత్రమే వసూలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ఇటీవల తీర్పు ఇవ్వడంతో.. మైదుకూరు మున్సిపాలిటీ కమిషనర్ అంచనా జనాభా ఆధారంగా విధించిన రూ.55 లక్షల ఆర్ఈటీని సవాల్ చేస్తూ ఓ బార్ యజమాని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై తుది విచారణ అనంతరం హైకోర్టు ఈ కీలక తీర్పును వెలువరించింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos