ఏపీలో ఇంటర్ మీడియట్ పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్ధులు ఈ పరీక్షలు రాస్తున్నారు. మొత్తం 10.58 లక్షల మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.  ఇవాళ పరీక్ష కేంద్రాలకు భారీ ఎత్తున విద్యార్ధులు తరలివచ్చారు. ఇంటర్ పబ్లిక్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1535 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో అభ్యర్ధుల్ని 8.45 గంటలకే చేరుకోవాలని అధికారులు ముందుగానే సూచించారు. అయినా ఆలస్యంగా వచ్చిన వారిని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించడం లేదు. నిమిషం ఆలస్యమైనా అనుమతించకూడదనే నిబంధన అమలు చేస్తున్నారు. గతంలో చోటు చేసుకున్న ప్రశ్నాపత్రాల లీకేజీ, మాస్ కాపీయింగ్ ఘటనల్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి పరీక్ష కేంద్రాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాలను 'నో మొబైల్‌ జోన్‌'గా ప్రకటించారు. అధికారిక సమాచారం కోసం మాత్రం పరీక్షల చీఫ్‌ సూపరింటెండెంట్‌కు మాత్రం ఓ కీప్యాడ్‌ ఫోన్‌ను అనుమతిస్తున్నారు. ఇంటర్మీడియట్‌ రెండు సంవత్సరాల విద్యార్థులకు రోజు మార్చి రోజు పరీక్షలు జరుగుతాయి. వచ్చేనెలలో ఫలితాలు విడుదల చేసే అవకాశముంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos