ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రశంసలు కురిపించారు. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారని, చంద్రబాబు వాటిని సమర్థంగా వినియోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఉదయం తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మల్లారెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించిందని, పరిస్థితి పూర్తిగా తలకిందులైందని అన్నారు. "గతంలో ఏపీలో ఆస్తులు అమ్ముకుని హైదరాబాద్ వచ్చేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తెలంగాణకు చెందినవారే ఇప్పుడు ఏపీలో ఆస్తులు కొంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారని" ఆయన వివరించారు. ప్రతి ఏటా తన పుట్టినరోజు నాడు స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ అని మల్లారెడ్డి తెలిపారు. గత ఏడాది తాను యూనివర్సిటీలు కావాలని స్వామిని కోరుకున్నానని, ఇప్పుడు దేశంలోనే మూడు పెద్ద డీమ్డ్ యూనివర్సిటీలను నడుపుతున్నానని గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో తెలంగాణలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా ఆయన మాట్లాడారు. "కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణలో దేశంలో ఎక్కడా జరగనంత అభివృద్ధి జరిగింది. కేటీఆర్ ఎన్నో మల్టీ నేషనల్ కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ఆ పాత రోజులు తిరిగి వస్తాయని" మల్లారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos