ఏపీలో కొత్త ఏడాదిలో రిజిస్ట్రేషన్ విలువల్ని సవరించాలని భావించిన ప్రభుత్వానికి అది సాధ్యం కాలేదు. దీంతో నెల రోజుల పాటు ఈ ప్రక్రియను వాయిదా వేసేసింది. అంతే కాదు తాజా ముహుర్తాన్ని కూడా ఫిక్స్ చేసింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ విలువల సవరణలో ఏం జరగబోతోందో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ క్లారిటీ ఇచ్చేశారు. నిజానికి ఏపీలో భూముల విలువ హేతుబద్దీకరణ ప్రక్రియను జనవరి ఒకటో తేదీ నుంచి చేయాలని అనుకున్నారు. అయితే కసరత్తు పూర్తి కాకపోవడంతో ఫిబ్రవరి ఒకటో తేదీకి వాయిదా వేశారు. ఏపీలో గత ప్రభుత్వ విధానాల వల్ల వివిధ ప్రాంతాల్లో భూముల విలువలు తేడాగా ఉన్నాయి. మామూలుగా అయితే రిజిస్ట్రేషన్ విలువకన్నా ... మార్కెట్ విలువ ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ విలువ ఎప్పటికప్పుడు మారుతుంది కానీ రిజిస్ట్రేషన్ విలువ ప్రభుత్వం మారిస్తేనే మారుతుంది.
గతంలో జగన్ ప్రభుత్వం ఆదాయం కోసం మార్కెట్ విలువలతో సమానంగా రిజిస్ట్రేషన్ విలువల్ని ఖరారు చేసారు. అయితే ఆ తరువాత ఆ భూములకు విలువ లేకుండా పోయింది. ఫలితంగా రేట్లు తగ్గిపోయాయి. చాలా చోట్ల రిజిస్ట్రేషన్ విలువ కంటే మార్కెట్ రేటు తక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. దీన్ని మార్చాలని ప్రస్తుత ప్రభుత్వం మార్చాలని నిర్ణయించింది. పూర్తి సమాచారం తెప్పించుకున్న ప్రభుత్వం ఈ మేరకు భూముల విలువను మదింపు చేస్తోంది. కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువను తగ్గించడం తో పాటు మరికొన్ని చోట్ల మార్పులు లేకుండా చూడనుంది. గత వైసీపీ హయాంలో అడ్డగోలుగా పెంచాయని భావిస్తున్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువల్లో కోత పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకు ఉదాహరణగా నరసరావుపేటలో రిజిస్ట్రేషన్ ధరల్ని కోటి వరకూ పెంచారని, వాటిని 20 లక్షలు చేయబోతున్నట్లు రెవెన్యూ మంత్రి క్లారిటీ ఇచ్చేసారు. దీన్ని బట్టి చూస్తే వైసీపీ నేతల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో వారికి భారీ షాకులు ఇచ్చే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ మంత్రి చెబుతున్న దాన్ని బట్టి చూస్తే వైసీపీ నేతలు పెంచిన ప్రాంతాలన్నింటిలోనూ రిజిస్ట్రేషన్ ధరల కోత తప్పేలా లేదు. అయితే అమరావతి, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో విలువల పెరుగుదల ఖాయంగా కనిపిస్తోంది.
కాగా ప్రభుత్వం మారిన తర్వాత విశాఖ, విజయవాడ, అమరావతితో పాటు చాలా చోట్ల భూముల విలువ పెరిగింది. ఇలాంటి చోట్ల రిజిస్ట్రేషన్ విలువల్ని పెంచనున్నారు. ఇలా డిమాండ్ ఉన్న చోట్ల రిజిస్ట్రేషన్ విలువల్ని.. మార్కెట్ రేటు ఎక్కువగా ఉన్న చోట్ల రిజిస్ట్రేషన్ విలువల్ని పెంచడం ద్వారా.. ఆయా ఓనర్లకు లాభం చేకూరుతుంది. రిజిస్ట్రేషన్ చేయించుకునేవారికి కాస్త భారం పడుతుంది కానీ.. వారి ఆస్తి విలువ రికార్డుల ప్రకారం ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos