ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడని పేరున్న నరెడ్డి సునీల్ రెడ్డికి చెందిన 10 కంపెనీలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ లోని బంజారా హిల్స్, కాటేదాన్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, కమలాపురి కాలనీ వంటి ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. షెల్ కంపెనీలు, మనీ లాండరింగ్ కు సంబంధించి సునీల్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లుగా అనుమానాలున్నాయి. నరెడ్డి సునీల్ రెడ్డి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. కాంట్రాక్ట్ కంపెనీ కూడా ఉంది. ఆయన కంపెనీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక ప్రాజెక్టులు చేపట్టాయి. లిక్కర్ స్కామ్ విచారణలో ఆయన పేరు మొదటిసారి 2025 మార్చిలో లోక్ సభలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు బయట పెట్టారు. ఆయనను జగన్ మోహన్ రెడ్డి 'బినామీ' అని వ్యాపార భాగస్వామి, మనీ లాండరర్ గా ఆరోపించారు. 2019-2024 మధ్య కాలంలో సునీల్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. సునీల్ రెడ్డికి చెందిన ఇన్ఫ్రా కంపెనీలు లిక్కర్ బిజినెస్ తో ముడిపడి, షెల్ కంపెనీల రూపంలో డబ్బును దేశం బయటకు పంపడంలో కీలక పాత్ర పోషించాయని అనుమానాలున్నాయి. ఆయన ద్వారా రూ. 2,000 కోట్లు దుబాయ్ కి మళ్లించారని ఈ ఏడాది మార్చిలో లోక్ సభలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. ఆయన కంపెనీలు 2019 - 24 మధ్య ప్రారంభమై, ముగిసినట్లు ఆర్థిక రికార్డులు చూపిస్తున్నాయని ఆయన బయట పెట్టారు. సునీల్ రెడ్డి జగన్ ఫ్యామిలీతో పాత సంబంధాలు కలిగి ఉన్నాడని, ఆయనను 'జగన్ మనీ ట్రాన్స్ పోర్టర్'గా టీడీపీ నేతలు పిలుస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ రూ. 3,500 కోట్ల స్కామ్ గా భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని మోనోపలీ చేసి, డిస్టిలరీల నుంచి స్వీకరించిన డబ్బును షెల్ కంపెనీల ద్వారా దేశం బయటకు పంపిందని సిట్ ఆరోపణ. ఈ స్కామ్ లో 12 మంది అరెస్టులు జరిగాయి, మరో 9 మంది పరారీలో ఉన్నారు. సునీల్ రెడ్డి ప్రధాన కార్యాలయంలో ఆఫీస్ రికార్డులు, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేశారు. షెల్ కంపెనీల రిజిస్ట్రేషన్ ఫైల్స్ సీజ్ చేశారు. రెసిడెన్షియల్, ఆఫీస్ ప్రాపర్టీలో తనిఖీలు చేశారు. మనీ ట్రాన్స్ఫర్ రికార్డులు, హవాలా లింకులు బహిర్గతమయ్యాయని సమాచారం. కార్యాలయాల్లో డాక్యుమెంట్స్, కంప్యూటర్లు స్కాన్ చేశారు. అధికారులు దుబాయ్ ట్రాన్స్ఫర్లకు సంబంధించిన ఈమెయిల్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ సేకరించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos