ఏపీ మద్యం కుంభకోణం కేసులోఇవాళ గురువారం మరో కీలక పరిణామం జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కంపెనీల నుంచి ముడుపులు తీసుకోవడం ద్వారా సుమారు 4 వేల కోట్ల మేర కుంభకోణానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం సిట్ ద్వారా దర్యాప్తు చేయిస్తోంది. ఈ క్రమంలో కుంభకోణానికి సూత్రధారులంటూ చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. ఇవాళ ఉదయం సుప్రీంకోర్టు మద్యం కుంభకోణంపై క్లారిటీ ఇచ్చేసింది.

మద్యం కుంభకోణంలో రాజ్ కెసిరెడ్డిని సీఐడీ సిట్ ఏ-1 నిందితుడుగా చేర్చింది. రాజ్ కెసిరెడ్డి తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంను ఆశ్రయించాడు. పిటిషన్‌పై విచారణ జరిపేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. కేసులో మొత్తం వ్యవహారానికి ఆర్కిటెక్ట్ (సూత్రధారి) రాజ్ కెసిరెడ్డేనని సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్ కెసిరెడ్డి వేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది. ఈ సందర్భంగా తమ పిటిషన్ వెనక్కి తీసుకునేందుకు రాజ్ కెసిరెడ్డి తరఫు లాయర్ అనుమతి కోరారు. దీంతో న్యాయస్థానం అంగీకరించింది.

గత సంవత్సరం మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన రాజ్ కెసిరెడ్డి తొమ్మిది నెలలుగా జైలులోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ లభించింది. రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో రాజ్ కెసిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే కేసులో ఇప్పటికే 750 కోట్లు మళ్లించిన షెల్ కంపెనీలతో అతడికి సంబంధాలు ఉన్నట్లు సుప్రీం నిర్ధారించింది. దీంతో రాజ్ కెసిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఇవాళ ఉదయం రాజ్ కెసిరెడ్డి తరఫు న్యాయవాది పిటిషన్ ఉపసంహరణకు అనుమతి కోరగా, సుప్రీం అంగీకరించింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos