ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సహా 12 మంది రిమాండ్‌ను ఏసీబీ కోర్టు సెప్టెంబర్ 3వ తేదీ వరకు పొడిగించింది. రిమాండ్ గడువు ముగియడంతో ఈరోజు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ పొడిగింపు నేపథ్యంలో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించగా, మరో 9 మంది నిందితులను విజయవాడ జిల్లా జైలుకు, ఇద్దరిని గుంటూరు జైలుకు తరలించారు. మరోవైపు, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ దాఖలు చేసిన చార్జిషీట్‌లపై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రెండు ఛార్జ్‌షీట్లలో 21కి పైగా అభ్యంతరాలున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. నిందితులు అందరికీ ముద్దాయి కాపీలు అందజేశారా? అని ప్రశ్నించారు. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం ఎలా వర్తిస్తుందో చెప్పాలని అడిగారు. దాఖలు చేసిన డాక్యుమెంట్లకు సరైన క్రమ సంఖ్యలు లేవని, వాటిని సరిచేసి మళ్లీ అందించాలని స్పష్టం చేశారు.
ఈ కేసులో మరింత విచారణ జరపాల్సి ఉందని అధికారులు కోరడంతో నిందితులకు న్యాయమూర్తి రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లుగా వెల్లడించారు. కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డితో పాటు చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక నవీన్ కృష్ణ, బాలాజీకుమార్ యాదవ్ గుంటూరు జైలులో, ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos