అమరావతి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సహకారంతో ఎపి-మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ ను  ప్రభుత్వం మంగళగిరిలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని విద్యార్థులకు భవిష్యత్ సాంకేతికలను వివరించే లక్ష్యంతో ప్రారంభించనున్న ఈ నమూనా వాహనాన్ని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో శుక్రవారం పరిశీలించారు. పైలట్ ప్రాజెక్టుగా ఈ వాహనం మంగళగిరిలోని స్కూళ్లకి వెళ్లి పిల్లల్లో అవగాహన కల్పిస్తుంది. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని స్కూళ్లకు ఇటువంటి వాహనాలను పంపిస్తారు. పరివర్తనాత్మక నైపుణ్య అవకాశాలను విద్యార్థుల వద్దకే తీసుకెళ్లేందుకు ఇన్ఫోసిస్‌ భాగస్వామ్యం కావడం అభినందనీయమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా విజన్, ESG విజన్ 2030కి ( ఎన్విరాన్ మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్) లక్ష్యాలకు అనుగుణంగా మారుమూల ప్రాంతాలకు ఉచిత డిజిటల్, STEM లెర్నింగ్ అవకాశాలను అందించడం మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ లక్ష్యం. ఎపి స్కిల్ డెవలప్ మెంట్ – ఇన్ఫోసిస్ సంయుక్త సహకారంతో ఎపి-మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభిస్తారు.  ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, మైక్రో కంట్రోలర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగాలపై ల్యాబ్ ఆన్ వీల్స్ ద్వారా విద్యార్థులకు బేసిక్ స్కిల్ అందించడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం.  ఎపి మేకర్ ల్యాబ్‌లో 90 నిమిషాల వ్యవధిలో ఇంటరాక్టివ్ లెర్నింగ్ సెషన్ ఉంటుంది. తర్వాత విద్యార్థుల ఆసక్తిని బట్టి  ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డు ప్లాట్‌ఫారమ్ ద్వారా ఉచితంగా వివిధ కోర్సులు నేర్చుకోవడానికి అవకాశం కల్పించి, వరల్డ్ క్లాస్ టెక్నాలజీ సర్టిఫికేషన్ అందజేస్తారు. మొబైల్ ల్యాబ్‌లో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్ లు, వర్క్‌స్టేషన్‌లు, ప్రయోగాల కోసం కిట్‌లతో సహా అత్యాధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం ఇన్ఫోసిస్ సంస్థ రూ.5 కోట్లతో ల్యాబ్ తో కూడిన బస్సు ఏర్పాటు చేయడం తో పాటు ప్రతి ఏడాది రూ. 40 లక్షల నిర్వహణ వ్యయాన్ని భరించడమేగాక విద్యార్థులకు కోర్సు కంటెంట్ తో పాటు ట్రైనర్ సపోర్టు అందిస్తుంది. ఇందుకోసం ఇన్ఫోసిస్ సంస్థ ఒక్కో విద్యార్థికి సగటున రూ.1,500 ఖర్చుచేస్తుంది. ఈ కార్యక్రమం కింద ప్రతి మూడునెలలకు 4,800 మంది విద్యార్థులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.  ప్రతిరోజూ 20 మంది విద్యార్థులతో కూడిన 4 బ్యాచ్‌లకు అవగాహన కల్పించాలన్నది ప్రధాన లక్ష్యమని ఇన్ఫోసిస్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి జి. గణేష్ కుమార్, నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఇన్ఫోసిస్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos