ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో భాగంగా మరో కీలక ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ 2025 విడుదల చేశారు. నిన్న ఆదివారం 20వ తేదీ ఉదయం 10 గంటలకు మేనిఫెస్టోలోని కీలక హామీని నెరవేరుస్తూ 16,347 టీచర్‌ పోస్టులకు ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ విద్యాశాఖ వెబ్‌సైట్‌ https://apdsc.apcfss.in/ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌ ద్వారా అప్లయ్‌ చేసుకోవచ్చు.

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ నిన్న ఉదయం 10 గంటల నుంచి పాఠశాల విద్యాశాఖ వెబ్ సైట్ లో సమాచారం అందుబాటులో ఉంచారు. రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాద్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. కర్నూలులో అత్యధికంగా 1,817 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఉపాధ్యాయ అభ్యర్థులు మే 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మెగా డీఎస్సీలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనుంది. వీటిలో జిల్లా స్థాయిలో 14,088 పోస్టులు ఉన్నాయి. ఇందులో అన్ని రకాల ఎస్జీటీ పోస్టులు 6,599 ఉన్నాయి, స్కూల్‌ అసిస్టెంట్లు 7,487, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు కలిపి 14,088 పోస్టులు ఉన్నాయి. ఇక రాష్ట్ర, జోనల్‌ స్థాయిలో 2,259 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో జోన్‌-1లో 400, జోన్‌-2లో 348, జోన్‌-3లో 570, జోన్‌-4లో 682 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో మొత్తం 13,192 పోస్టులు, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 881 పోస్టులు, జువెనైల్‌ పాఠశాలల్లో 15 పోస్టులు, రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసే బధిరులు, అంధుల పాఠశాలల్లో 31 పోస్టులు ఉన్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos