ఏపీలో మరో ఎన్నికకు నగారా మోగింది. ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. వచ్చే నెల 20న ఈ ఎన్నికకు పోలింగ్ జరగనుంది. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, బీసీ సంఘం నేతం ఆర్. కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇందులో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు టీడీపీలో చేరారు. ఆర్.కృష్ణయ్య మాత్రం ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరలేదు.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్టీల బలాబలాలు పూర్తిగా మారిపోయాయి. ఈ మూడు రాజ్యసభ సీట్లు కూడా టీడీపీకే దక్కే అవకాశం ఉంది. ఇందులో రెండిటిని వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో చేరిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావుకు చంద్రబాబు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్.కృష్ణయ్య రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందన్న అంశం ఏపీ పాలిటిక్స్ లో ఉత్కంఠగా మారింది. ఈ సీటు జనసేన లేదా బీజేపీకి దక్కే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి వైసీపీకి అసెంబ్లీలో కేవలం 11 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. దీంతో వారు అభ్యర్థిని నిలుపుతారా.. లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీ అభ్యర్థి నిలబెట్టకపోతే.. ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఒకవేళ నిలబడితే ఎన్నిక నామ మాత్రం కానుంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos