ఉండవల్లి: పాఠశాల విద్యలో గత వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకువచ్చిన జీవో 117 ఉపసంహరణపై క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జీవో 117 ఉపసంహరణపై ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పాఠశాల విద్య డైరెక్టర్ నిర్వహించిన సన్నాహక సమావేశాలలో వచ్చిన అభిప్రాయాలను, సూచనలను ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. ఆయా సూచనలను పరిగణనలోకి తీసుకుని ఏ విద్యార్థి డ్రాప్ అవుట్ అవకుండా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అతిత్వరలోనే చేపట్టబోయే ఉపాధ్యాయ బదిలీ చట్టంపైనా సమావేశంలో చర్చించారు. ఈ చట్టంపై ఉపాధ్యాయులు, సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించాలని సూచించారు. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టాలి. ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించి విద్యార్థులకు కో కరిక్యులమ్ యాక్టివిటీస్ రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ఉపాధ్యాయులకు ఇప్పుడున్న అనేక యాప్ ల స్థానంలో ఒకటే యాప్ ను రూపొందించే కార్యక్రమాన్ని త్వరతిగతిన పూర్తి చేయాలి. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వాస్తవ సంఖ్యను నిర్థారించేందుకు అపార్ ఐడీని అనుసంధానించే కార్యక్రమాన్ని పూర్తిచేయాలి. ప్రజాభిప్రాయసేకరణ కోసం అతి త్వరలోనే ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింట్ ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖలో చేపట్టబోయే సంస్కరణలపైనా సమావేశంలో విపులంగా చర్చించారు. ఈ భేటీలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ వి.విజయ్ రామరాజు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos