ఏపీ నూతన డీజీపీ దాదాపు ఖరారయ్యారు. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. 2024 ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం.. నాటి డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి స్థానంలో హరీష్ కుమార్ గుప్తాకు అవకాశం ఇచ్చింది. కానీ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ద్వారకా తిరుమల రావును డీజీపీగా నియమించారు. ఇప్పుడు ఆయన స్థానంలో కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ మొదలైంది. అయితే, కొత్త డీజీపీ ఎంపిక పైన సీఎం చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఎన్నికల సమయంలో డీజీపీగా పని చేసిన సీనియర్ ఐపీఎస్, 1992 బ్యాచ్ కు చెందిన హరీశ్ కుమార్ గుప్తా వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది . సీనియారిటీ లిస్టులో 1991 బ్యాచ్‌కు చెందిన అగ్నిమాపకశాఖ డైరెక్టర్‌ జనరల్‌ మాదిరెడ్డి ప్రతాప్‌ మొదటి స్థానంలో ఉండగా.. హరీష్‌ కుమార్ గుప్తా రెండో స్థానంలో ఉన్నారు. మాదిరెడ్డి ప్రతాప్ గతం లో జగన్ హయాంలో ఆర్టీసీ ఎండీగా పని చేసారు. ఆ సమయంలో ఒక వివాదంలో ప్రభుత్వం ఆయన పైన విచారణకు ఆదేశించింది. మాదిరెడ్డి ప్రతాప్ పై ప్రస్తుత ప్రభుత్వం ఆ విచారణ నిలిపివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావును కొనసాగిస్తారనే అంశం పైనా చర్చ జరిగింది. కానీ, ప్రభుత్వం నుంచి ఆ దిశగా ఎలాంటి ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లలేదు. దీంతో, కొత్త డీజీపీ నియామకం ఖాయమైంది. ఈ సమయంలోనే సీనియర్ ఐపీఎస్ రవి శంకర్ అయ్యన్నార్ పేరు పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది.

కాగా, అన్ని సమీకరణాల్లోనూ పరిశీలన తరువాత విజయనగరం జిల్లాకు చెందిన హరీశ్ కుమార్ గుప్తా కొత్త డీజీపీగా ఖరారు చేసినట్లు సమాచారం. హరీశ్ కుమార్ ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా పని చేస్తున్నారు. సీనియార్టీ, సుదీర్ఘ సేవలను పరిగణలోకి తీసుకొని డీజీపీని ఖరారు చేయనున్నారు. దీంతో, ప్రస్తుతం హరీష్ కుమార్ గుప్తా వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి తిరిగి వచ్చిన తరువాత డీజీపీ నియామకం పైన అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos