ఏపీలో తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీ ఆరోపణలపై సిట్ రిపోర్ట్ ఇచ్చాక చంద్రబాబుపై విమర్శలకు దిగిన వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ కార్యకర్తలు, నేతలు దాడులకు దిగారు. దీనిపై ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేయడంతో పాటు వారికి స్టేషన్ బెయిల్స్ కూడా ఇచ్చి పంపేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC) కి ఈ మేరకు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని పేర్కొంటూ వైసీపీ ప్రతినిధుల బృందం ఇవాళ ఎన్‌హెచ్‌ఆర్‌సి చైర్‌పర్సన్ జస్టిస్ సుబ్రమణియాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఇందులో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులను, అలాగే దళిత కార్యకర్త సాల్మన్ హత్యను, ఇతర దాడులపై ఆధారాలతో సహా వివరాలు అందజేశారు. ప్రతిపక్ష నాయకులను భౌతికంగా నిర్మూలించడానికి ప్రయత్నాలు జరిగినట్లు వైసీపీ నేతలు పేర్కొన్నారు. చంద్రబాబు అరాచక పాలనపై చర్యలు తీసుకోవాలని వారు హెచ్చార్సీని కోరారు.

ఎన్‌హెచ్‌ఆర్‌సి చైర్‌పర్సన్ సానుకూలంగా స్పందించారని, డీజీపీ నుండి నివేదిక కోరుతామని, నిజ నిర్ధారణ బృందం రాష్ట్రాన్ని సందర్శించే అవకాశం ఉందని అనంతరం వారు వెల్లడించారు. దాడులపై సమగ్ర దర్యాప్తు కోరామని, NHRC దర్యాప్తు బృందం త్వరలో ఆంధ్రప్రదేశ్‌ను సందర్శిస్తుందని సమావేశం తర్వాత వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos