ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుపై కస్టోడియల్  టార్చర్ కేసులో సునీల్ నాయక్ ను అరెస్టు చేసి ఏపీకి తరలించే విషయంలో ఏపీ పోలీసులకు చుక్కెదురైంది. బీహార్ క్యాడర్  సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన సునీల్ నాయక్ ప్రస్తుతం ఆ రాష్ట్ర ఫైర్ సర్వీస్ ఐజీగా ఉన్నారు. జగన్ హయాంలో డిప్యూటేషన్ పై ఏపీ సీఐడీలో పని చేసిన సునీల్ నాయక్ పై అప్పట్లో రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఇక్కడ నుంచి రిలీవ్ అయి బీహార్ కు వెళ్లారు. ఆయనను ఇప్పుడు బీహార్ లో అరెస్టు చేసిన పోలీసులు ట్రాన్సిట్ రిమాండ్ కోరుతూ బీహార్ కోర్టును ఆశ్రయించారు. అయితే   సునీల్ నాయక్ కు ట్రాన్సిట్ రిమాండ్ ఇచ్చేందుకు బీహార్ కోర్టు నిరాకరించింది.  ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా, 30 రోజుల పాటు ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. పాట్నాలోని శాస్త్రి నగర్‌లో ఉన్న సునీల్ నాయక్ నివాసానికి నిన్న చేరుకున్న ఏపీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పాట్నా అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఏసీజేఎం) కోర్టులో హాజరుపరిచి, ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు ట్రాన్సిట్ వారెంట్ కోరారు.  అయితే, ఏపీ పోలీసుల బృందం సరైన అరెస్ట్ వారెంట్ గానీ, అప్‌డేట్ చేసిన కేస్ డైరీ గానీ సమర్పించలేదని పేర్కొంటూ  స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడాన్ని కూడా  విధానపరమైన లోపంగా పరిగణిస్తూ  ట్రాన్సిట్ రిమాండ్‌ను తిరస్కరిస్తూ సునీల్ నాయక్‌ను విడుదల చేయాలని  కోర్టు ఆదేశించింది. సునీల్ నాయక్ ను అరెస్టు చేసిన పద్ధతిపై హోమ్ గార్డ్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా నాయక్ నివాసం వద్ద నిరసన తెలిపారు. పాట్నా ఈస్ట్ సిటీ ఎస్పీ భాను ప్రతాప్ సింగ్ తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని వారిని సముదాయించారు. కాగా.. ఈ కేసులో తదుపరి చర్యలు ఏమిటనే డానిపై ఏపీ పోలీసులు నిర్ణయం  తీసుకోవాల్సి ఉంటుంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos